ఏజ్ 44.. అయినా పిండుడు పిండుడే

Update: 2018-01-05 08:30 GMT
మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ కి ఇప్పటికీ బోలెడంత ఫ్యాన్ బేస్ ఉందనే సంగతి ఒప్పుకోవాల్సిందే. తన అందం.. అభినయంతో కోట్లాది మంది అభిమానులను కూడగట్టుకున్న ఈ నీలి కళ్ల సుందరి.. ఇప్పటికీ తన రేంజ్ చాటుతూనే ఉంది. 2016లో యే దిల్ హై ముష్కిల్ తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న ఐష్.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తోంది.

ఫన్నే ఖాన్ అనే చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ.. మరోవైపు ఇంకా పేరు నిర్ణయించని ఓ థ్రిల్లర్ లో కూడా యాక్ట్ చేస్తోంది. వీటితో పాటు 1967నాటి రాత్ ఔర్ దిన్ రీమేక్ లో కూడా నటించేందుకు యాక్సెప్ట్ చేసిందట ఐశ్వర్యారాయ్ బచ్చన్. అప్పట్లో నర్గీస్ దత్ చేసిన పాత్రను ఇప్పుడు ఐష్ తో చేయించనున్నారు మేకర్స్. అయితే.. ఈ సినిమా కోసం ఐశ్వర్యకు ఏకంగా 10 కోట్ల పారితోషికం ఇవ్వనున్నారనే వార్తలు సెన్సేషన్ అవుతున్నాయి. 44 ఏళ్ల వయసులో లీడ్ రోల్స్ అందుకోవడమే ఆశ్చర్యం అయితే.. ఇంతటి రెమ్యూనరేషన్ అందుకునే స్థాయి మెయింటెయిన్ చేయడం అంత సులభం కాదు. కానీ రాత్ ఔర్ దిన్ మూవీలో ఐష్ డ్యుయల్ రోల్స్ చేయాల్సి ఉంటుందని.. రెండు పాత్రలకు వేరియేషన్ చూపించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

సుదీర్ఘకాలం డేట్స్ కేటాయించడంతో పాటు.. ఈ చిత్రం చేసే సమయంలో వేరే సినిమాలను యాక్సెప్ట్ చేయడం కుదరదట. అందుకే ఐష్ కు అంత భారీ మొత్తం ఇచ్చేందుకు నిర్మాత ప్రేరణా అరోరా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News