ఈ నెల 14న ఇండస్ట్రీ ఇంకో బ్లాక్ బస్టర్ చూడబోతోంది: అజయ్ భూపతి

Update: 2021-10-10 03:31 GMT
అజయ్ భూపతి పేరు వినగానే 'ఆర్ ఎక్స్ 100' సినిమా  గుర్తుకు వస్తుంది. రొమాన్స్ కి ఎమోషన్ ను జతచేసి ఆయన ఆ కథను నడిపించిన తీరు యూత్ కి బాగా నచ్చేసింది. ఆ తరువాత ఆయన లవ్ .. ఎమోషన్ ను అలా ఉంచి వాటికి యాక్షన్ ను కూడా జతచేసి 'మహా సముద్రం సినిమా చేశాడు. శర్వానంద్ .. సిద్ధార్థ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ .. అదితీరావు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిన్న రాత్రి హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో  జరిగింది.

ఈ వేదికపై అజయ్ భూపతి మాట్లాడుతూ .. 'మహా సముద్రం'  జర్నీ నా లైఫ్ లో మరిచిపోలేని జర్నీ. 'ఆర్ ఎక్స్ 100' వంటి బ్లాక్ బస్టర్ తరువాత నేను ఇద్దరి హీరోల స్టోరీ రాసుకుని, చాలా మంది హీరోలను ఒప్పించడానికి ప్రయత్నించాను. ఈ కథను విన్నవాళ్లంతా కూడా చాలా బాగుందని తమకి తెలిసిన  వాళ్ల దగ్గర చెప్పుకునేవారు. 'ఆర్ ఎక్స్ 100' కంటే ముందు శర్వా నంద్ గారితో ఒక సినిమా  చేయాలనుకున్నాను. కానీ ఆయనను కలవడమే కుదరలేదు. ఈ కథను మాత్రం రావు రమేశ్ గారి ద్వారా శర్వానంద్ విన్నాడు. అంతకుముందే సిద్ధార్థ్ కి కథ చెప్పేసి ఒప్పించి ఉన్నాను.

శర్వానంద్ .. నేను కలిసి నిర్మాత అనిల్ సుంకర గారి దగ్గరికి వెళ్లాము. ఈ పనులన్నీ కూడా చాలా ఫాస్టుగా చకచకా జరిగిపోయాయి. షూటింగు మొదలుపెడదామని అనుకుంటూ ఉండగా కరోనా అడుగుపెట్టింది. ఫస్టు వేవ్ పూర్తయిన తరువాత షూటింగు మొదలుపెట్టేసి 4 నెలలలో షూటింగును  పూర్తి చేశాము. అంత ఫాస్టుగా తీయడానికి కారణం అనిల్ సుంకర గారు. కంప్లీట్ గా అవుట్ డోర్ షూటింగ్ .. ఎక్కడా ఒక్క రోజు కూడా వేస్టు కాలేదు. ట్రైలర్ చూసినవాళ్లు కథ ఏంటి .. ఏ జోనర్ అని అడుగుతున్నారు.

ఇది ఒక వైలెంట్ లవ్ స్టోరీ .. భావోద్వేగాలతో కూడిన ప్రేమకథ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో కూడుకున్న కథ.  కొంతమంది జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయి .. ఎవరివలన అయ్యాయి అనేవి కూడా ఉంటాయి. అదే సమయంలో యాక్షన్ కూడా ఉంటుంది. ఇన్ని ఎమోషన్స్ 'ఆర్ ఎక్స్ 100'కి కూడా కుదరలేదు. 'మహా సముద్రం'లో అన్నిరకాల ఎమోషన్స్ కుదిరాయి. ఇక్కడ హీరో ఎవరంటే .. స్టోరీనే. అవును .. ఈ 'మహా సముద్రం' విషయంలో 100 పర్సెంట్ స్టోరీనే హీరో.

నేను ఇద్దరి హీరోలతో ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలామంది ఒక మాట అన్నారు .. రామ్ గోపాల్ వర్మ కూడా అన్నారు. 'శర్వానీ .. సిద్ధూని నువ్వు ఎలా హ్యాడిల్ చేస్తావో చూస్తాను' అన్నారు. నిజం చెబుతున్నాను ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారకులు వాళ్లిద్దరే. నన్ను వాళ్లు ఎంతగానో నమ్మారు  .. నేను ఏది చెబితే అది చేశారు. ఒక్కసారి కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను సినిమా తీసుకున్నాను. నిజంగా చెబుతున్నాను అక్టోబర్ 14వ తేదీన తెలుగు ఇండస్ట్రీ ఇంకొక బ్లాక్ బస్టర్ ను చూడబోతోంది .. ఇది రాసుకోండి" అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన ఆ మాట అనడంతో, ఆడిటోరియం అంతా కూడా విజిల్స్ .. క్లాప్స్ తో మారుమ్రోగిపోయింది.
Tags:    

Similar News