వంద కోట్ల సినిమా జస్ట్ 3 కోట్ల లోపే?

Update: 2019-02-27 11:32 GMT
పక్క రాష్ట్రంలో అజిత్ సూపర్ స్టార్ కావొచ్చు. అభిమానులకు దేవుడి కన్నా ఎక్కువే ఉండొచ్చు. ఎలాంటి రొటీన్ సినిమా చేసినా వందల కోట్ల వసూళ్లు ధారాళంగా కురిపిస్తూ ఉండొచ్చు. అయితే అదంతా తమిళనాడు బోర్డర్ కే పరిమితం. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి అజిత్ సినిమాలకు చాలా మార్కెట్ పరిమితి ఉంది. అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం ప్రేమలేఖ లాంటి బ్లాక్ బస్టర్ తో పేరు తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత ఇక్కడ సరైన మార్కెట్ ని సృష్టించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు.

అందుకే కోలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ వచ్చినా అజిత్ కు ఇక్కడ మాత్రం అంత గ్రాండ్ వెల్కమ్ ఉండదు. ఎల్లుండి అజిత్ విశ్వాసం విడుదల అవుతోంది. భారీ అంచనాలు లేవు కానీ ఆల్రెడీ అక్కడ హిట్ అయ్యి ఇక్కడికి వస్తోంది కాబట్టి మాస్ ని ఆకట్టుకునే ఛాన్స్ లేకపోలేదు. ఇక్కడొక విచిత్రం గురించి చెప్పుకోవాలి. 90 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ తో ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల దాకా రాబట్టిన విశ్వాసం తెలుగులో జరుపుకున్న బిజినెస్ జస్ట్ 2 కోట్ల 60 లక్షలు అని టాక్. అంతేనా అని ఆశ్చర్యపోకండి.

అజిత్ కున్న మార్కెట్ పరిమితుల దృష్ట్యా తప్పదు మరి. ఇప్పటిదాకా అజిత్ సినిమాల్లో అత్యధిక బిజినెస్ జరుపుకున్న మూవీ వివేకం. దాదాపు 5.5 కోట్లు. అది స్ట్రెయిట్ రిలీజ్ కాబట్టి ఎక్కువ మొత్తం పలికింది. కానీ విశ్వాసం సుమారు ఒరిజినల్ రిలీజైన 50 రోజులకు మనల్ని పలకరిస్తుంది. సో ఈ రెండున్నర కోట్లే రీజనబుల్ అని చెప్పొచ్చు. ఇదే సినిమా రజనీకాంతో సూర్యనో అయ్యుంటే లెక్క వేరుగా ఉండేది కానీ అజిత్ కాబట్టి బయ్యర్లు ఇంత కన్నా రిస్క్ చేయలేరు మరి
Tags:    

Similar News