అఖండ బ్యూటీ.. ఈసారి హీటెక్కించే డ్యాన్స్

Update: 2022-12-17 03:55 GMT
కొంతమంది హీరోయిన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సక్సెస్ అందుకుంటే వెంటనే నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటారు. కానీ ప్రగ్యా జైస్వాల్ అదృష్టం ఏమిటో గాని సక్సెస్ అయిన తర్వాత ఆమె ఎక్కువ అవకాశాలను అందుకోవడం లేదు. ఆమె బ్యాడ్ లక్ ఏమిటో గాని ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయితే మళ్లీ వెంటనే మరో సినిమాతో డిజాస్టర్ అందుకుంటుంది. ఆమెకు నటిగా అయితే మంచి గుర్తింపు ఉంది. కెరీర్ మొదట్లో కంచె సినిమాతోనే పరిపూర్ణమైన యాక్టర్ గా ఓవర్గం వారిని బాగానే ఆకట్టుకుంది.

ఇక తర్వాత ఈ బ్యూటీ కొన్ని కమర్షియల్ సినిమాలు కూడా చేసింది. ఒక విధంగా అలాంటి సినిమాలు చేయడం వల్లే ఆమె రేంజ్ కూడా కాస్త తగ్గింది అనే చెప్పాలి. అయితే సినిమాలు రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తన నుంచి ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. సోషల్ మీడియాలో గ్లామరస్ అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తుంది.

రీసెంట్గా అమ్మడు ఊహించని విధంగా మరో ఘాటైన డ్యాన్స్ తో మెప్పించే ప్రయత్నం చేసింది. ఇంతకుముందు బికినీ అందాలతో ప్రత్యేకమైన ఫోటోషూట్స్ చేసి ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈసారి మాత్రం హీటెక్కించే పాటలతో తన గ్లామర్ ని హైలైట్ చేస్తోంది. ఒక విధంగా ఈ డ్యాన్స్ పర్ఫామెన్స్ కూడా బాగానే ఉన్నప్పటికీ ఆమెకు పెద్దగా అవకాశాలు అయితే రావడం లేదు.

ఇదే తరహాలో అవకాశాలను అందుకోవాలని బాగానే ప్రయత్నాలు చేస్తోంది.. ఆమధ్య అఖండ సినిమాతో భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్లీ వెంటనే సన్నాఫ్ ఇండియా సినిమాతో డిజాస్టర్ అందుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటివరకు ఉన్న రేంజ్ ఇంకాస్త తగ్గిపోయింది. అందుకే మళ్ళీ గ్లామర్ తో సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఓ తమిళ సినిమా చేసేందుకు ప్రగ్యా చర్చలు జరుపుతున్నట్లుగా టాక్. అలాగే కన్నడలో కూడా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Tags:    

Similar News