'అఖండ'మైన విజయం సాధిస్తే పెద్ద సినిమాలకు ఊపొచ్చినట్లే..!

Update: 2021-11-24 07:44 GMT
కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత ఇప్పుడిప్పుడే మెల్లగా ఇండస్ట్రీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవల విడుదలైన 'లవ్ స్టోరీ' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వంటి చిత్రాలు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లోనూ మంచి వసూళ్ళు రాబట్టాయి.

అయితే బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించే పెద్ద సినిమా ఒక్కటి కూడా థియేటర్లలోకి రాలేదు. ఈ నేపథ్యంలో పాండమిక్ తర్వాత టాలీవుడ్ నుంచి ప్రేక్షకుల ముందుకొస్తున్న మొదటి భారీ చిత్రం 'అఖండ' అనే అనుకోవాలి.

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''అఖండ''. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రీ రిలీజ్ థియేట్రికల్ డీల్స్ భారీ ధరలకు అమ్ముడవుతున్నాయి.

ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా థియేటర్లలో ఎలాంటి ప్రభావం చూపుతుందో అని ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ ధరలు మరియు మహమ్మారి భయంతో ఇంకా ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్ల వైపు చూడకపోవడం వంటి అనేక సవాళ్లు ఉన్నాయి. అయితే కంటెంట్ బాగుంటే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలను థియేటర్లలో చూసేందుకు సిద్ధంగా ఉన్నారని ఇటీవల కొన్ని చిత్రాలు రుజువు చేశాయి.ఇప్పుడు 'అఖండ' సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తారని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

'అఖండ' సినిమా వీక్ డేస్ లో ఎలాంటి ప్రదర్శన ఇస్తుంది? కుటుంబ ప్రేక్షకులు ఏ మేరకు థియేటర్లకు వస్తారో చూడాలని టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ వేచి చూస్తున్నారు. బాలయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ళు రాబడుతోందో అని పెద్ద సినిమాలని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ఎదురు చూస్తున్నారు.

క్రిస్మస్ కు 'పుష్ప' - సంక్రాంతి సీజన్ లో 'ఆర్.ఆర్.ఆర్' 'రాధే శ్యామ్' 'భీమ్లా నాయక్' వంటి సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు 'అఖండ' సినిమా మంచి కలెక్షన్స్ రాబడితే వాటన్నింటికీ నూతనోత్సాహం వస్తుందనడంలో సందేహం లేదు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

కాగా, 'సింహా' 'లెజండ్' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య - బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ''అఖండ''. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్ - జగపతిబాబు - శ్రీకాంత్ - పూర్ణ - సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.


Tags:    

Similar News