ఒకప్పుడు థియేటర్లు తక్కువగా ఉండటం వలన .. టౌన్లలో ఉన్న థియేటర్లలోనే చుట్టుపక్కల ప్రాంతాలవారు సినిమాలు చూడటం వలన .. ఆ థియేటర్లలో ఒక సినిమా ఎక్కువ రోజుల పాటు ఉండటానికి అవకాశం ఉండేది. అలా ఆయా కేంద్రాల పరిథిలో జనాలను బట్టి ఆ సినిమాలు 100 రోజులపైనే ఆడేసేవి. 300ల రోజులు .. 1000 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో సినిమా విదులైపోతోంది. కాస్త బాగుంటే వారం రోజులు .. లేదంటే రెండు రోజులు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
ఇలాంటి పరిస్థిత్తులో విడుదలైన 'అఖండ' తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది. చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో ఈ సినిమా ఏకధాటిగా 175 రోజులను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ థియేటర్ యాజమాన్యం సెలబ్రేషన్స్ ను నిర్వహించింది.
ఈ వేడుకకి బాలకృష్ణ - బోయపాటి హాజరయ్యారు. ఈ వేదికపై బాలకృష్ణ మాట్లాడుతూ .. "కులమత వర్గాలకు అతీతంగా ఈ సినిమాను అందరూ ఆదరించారు .. అందువల్లనే ఇంత పెద్ద హిట్ అయింది. నా నుంచి ఎప్పుడూ ఏమీ ఆశించకుండా మీరు చూపించే అభిమానమే నాకు శ్రీరామరక్ష.
అభిమానమనేది డబ్బుతో కొనేది కాదు .. ప్రలోభాలకు లొంగేది కాదు. మీకు .. నాకు జన్మజన్మల అనుబంధం ఉండిఉంటుంది. కొత్తగా నేను ఏ ప్రయత్నం చేస్తున్నా ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరోనా సమయంలో విడుదలైన ఈ సినిమా .. ఇళ్లకు పరిమితమైన ప్రేక్షకులకు ఊపిరిని ఇచ్చింది.
అలాంటి ఈ సినిమా 175 రోజుల వేడుకను నిర్వహించడానికి ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే .. చరిత్ర సృష్టించాలన్నా మేమే .. దానిని తిరగరాయాలన్నా మేమే.
నా అభిమానులు ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటున్నారు. మా నాన్నగారు తెలుగువారికి ఎక్కడ ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు. ఆయన పంచెకట్టు చూసినవారు .. తెలుగువారు ఇలా ఉంటారా అని అనుకున్నారు. తెలుగువారి గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన ఆ మహానుభావుడికి నేను వందనాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను" అంటూ ముగించారు.