సంక్రాంతికి విడుదల అయిన బంగార్రాజు సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. మంచి వసూళ్లు నమోదు అవుతున్న బంగార్రాజు పై పలువురు ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేశారు. తాజాగా బంగార్రాజు విజయంపై అఖిల్ అక్కినేని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ సంక్రాంతికి బంగార్రాజు విజయాన్ని దక్కించుకోవడం ఆనందంగా ఉందన్న అఖిల్ కొడుకుగా.. తమ్ముడిగా గర్విస్తున్నాను అన్నట్లుగా ట్వీట్ చేశాడు. సంక్రాంతి నిజంగా బంగార్రాజు టీమ్ దే. బంగార్రాజు టీమ్ అందరికి కూడా అభినందనలు. అక్కినేని ఫ్యామిలీకి మరియు ఫ్యాన్స్ కు మరో ఘన విజయాన్ని ఇచ్చినందుకు గాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కు అఖిల్ కృతజ్ఞతలు తెలియజేశాడు. అఖిల్ ట్వీట్ తండ్రి మరియు సోదరుడిపై ఉన్న అభిమానం మరియు ప్రేమను చూపించింది.
నాగార్జున మరియు నాగ చైతన్యలు కలిసి నటించిన బంగార్రాజు సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం వల్ల చాలా ప్లస్ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు ఏమీ లేవు.. పైగా వచ్చిన సినిమాలు అని కూడా పెద్దగా బజ్ లేని సినిమాలు అవ్వడం వల్ల బంగార్రాజుకు లక్ కలిసి వచ్చినట్లయ్యింది. నాగార్జున మొదటి నుండి కూడా చాలా నమ్మకంతో సంక్రాంతికి విడుదల చేయాలని భావించాడు. కాని సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ మరియు రాధేశ్యామ్ వంటి సినిమాలు ఉండటం వల్ల బంగార్రాజు వచ్చేనా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని నాగార్జున మాత్రం సంక్రాంతి పై టార్గెట్ అన్నట్లుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను చేయించి అనుకున్నట్లుగా సంక్రాంతికి విడుదల చేయించాడు. ముఖ్యంగా విడుదల వారం పది రోజులు ఉండగా యూనిట్ సభ్యులు ఏ ఒక్కరు కంటి మీద కునుకు లేకుండా వర్క్ చేసినట్లుగా తెలుస్తోంది.
సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాలో చైతూకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించారు. బంగార్రాజుకు దక్కిన టాక్ నేపథ్యంలో ఖచ్చితంగా మరో బంగార్రాజు వస్తాడనే నమ్మకంను నాగార్జున వ్యక్తం చేశాడు. తప్పకుండా బంగార్రాజు సినిమా సీక్వెల్ ను చేస్తామని నాగార్జున హామీ ఇచ్చాడు కాని అది ఇప్పట్లో ఉండక పోవచ్చు అని అన్నాడు. నాగార్జున మరో వైపు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమాను ముగించి సమ్మర్ లో విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అఖిల్ ఏజెంట్ సినిమా సమ్మర్ విడుదలకు సిద్దం అవుతోంది.