ఎన్టీఆర్ తో ఆ ఇద్దరి పార్టీ!!

Update: 2017-04-03 06:50 GMT

జూనియర్ ఎన్టీఆర్ తో పార్టీ అంటే ఓ రేంజ్ లో ఎంజాయ్మెంట్ ఉంటుందని టాక్. తను ఓ స్టార్ అనే విషయాన్ని  పట్టించుకోకుండా అందరితో కలిసి ఎంజాయ్ చేసేయడం.. ఇంకా చెప్పాలంటే అందరికీ మించి హంగామా చేసేయడం యంగ్ టైగర్ స్పెషాలిటీ. ఇప్పుడు అలాంటిదే ఓ పార్టీ పిక్ ఇంటర్నెట్ లో హంగామా చేస్తోంది.

దగ్గుబాటి రానా.. అక్కినేని అఖిల్ లతో కలిసి రీసెంట్ గా ఓ పార్టీలో పాల్గొన్నాడు ఎన్టీఆర్.  పార్టీలో ముగ్గురూ కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పార్టీ తర్వాత ముగ్గురూ కలిసి ఓ ఫోటోకి ఫోజ్ ఇవ్వగా.. రానా-అఖిల్ ల భుజాలపై దాదాపుగా ఎక్కేశాడు ఎన్టీఆర్. ఇలా ఎన్టీఆర్ ఫోటోలకు చిక్కడం బాగా అరుదు. అందుకే ఈ పిక్ వైరల్ గా సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇంతకీ ఈ పార్టీ ఎక్కడిది అనే డౌట్ రావడం సహజం. రీసెంట్ గా ఐఫా ఉత్సవం జరిగింది కదా. ఆ వేడుక తర్వాత జరిగినదే ఈ పార్టీ.

ఈ ఐఫా వేడుకల్లో ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు దగ్గుబాటి రానా ఈ ఉత్సవాన్ని హోస్ట్ చేయడం విశేషం. అఖిల్ విషయంలో కూడా స్పెషాలిటీ ఉంది. చాలా వారాల తర్వాత అఖిల్ తొలిసారిగా ఐఫా వేడుకల్లోనే పబ్లిక్ కి దర్శనం ఇవ్వగా.. తన డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో కూడా అలరించేశాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News