మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలోని ఓ సిగ్నేచర్ పోజ్ ను.. తన చిన్నతనంలో ఇమిటేట్ చేస్తున్న ఫోటోను.. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ పోస్ట్ చేశాడు. అంతే కాదు.. 'నా చిన్నప్పుడు గ్యాంగ్ లీడర్ లో మెగాస్టార్ ని ఇమిటేట్ చెయ్యడానికి ట్రై చేశా' అంటూ ఓ కామెంట్ కూడా పెట్టాడు. బుల్లి ఏజ్ లో.. మెగా వారసుడు మెగాస్టార్ ని ఇమిటేట్ చేసే ఫోటో.. ఫ్యాన్స్ ని విపరీతంగా థ్రిల్ చేసింది.
అభిమానుల్లోనే కాదు.. సెలబ్రిటీల్లో ఈ ఫోటో హాట్ టాపిక్ అయింది. ఇక యంగ్ హీరోలయితే వరుణ్ తేజ్ గురించి మాట్లాడుకునేందుకు ఇదో సబ్జెక్ట్ గా మారిపోయింది. ఇప్పుడు అక్కినేని హీరో అఖిల్ కూడా ఈ ఫోటోపై కామెంట్ చేశాడు. అదే సమయంలో మెగా హీరోని ఆట పట్టించేందుకు ట్రై చేశాడు. 'నాకు తెలుసు.. నువ్వెప్పుడూ అన్నీ డ్రమెటిక్ గానే చేస్తావ్ లే' అంటూ వరుణ్ తేజ్ పై చలాకీ కామెంట్ వేశాడు అక్కినేని అఖిల్. దీనికి వరుణ్ తేజ్ కూడా ఏం తగ్గలేదు. తన పోజ్ కి తగ్గ రేంజ్ లో రిప్లయ్ పెట్టాడు.
'అందుకే ఇప్పుడు నా ప్రొఫెషన్ ఇదే' అంటూ రిప్లయ్ ఇస్తూ.. తను యాక్టర్ గా మారడానికి మెగాస్టార్ ఇన్ స్పిరేషన్ అని ఇన్ డైరెక్టుగా చెప్పాడు వరుణ్ తేజ్. మొత్తానికి ఇద్దరు కుర్ర హీరోల సరదా ట్వీట్ ఆట.. అభిమానులకు వినోదాన్ని పంచింది.