అక్కినేని అందగాడు అన్న పేరుకి సార్ధక నామధేయుడు అఖిల్. కుర్రాడిలో అందం ఉంది. ఒడుపు ఉంది. వేగం ఉంది. ఉత్సాహం ఉంది. అందుకే టార్గెట్‌ని ఛేదించడానికి యమఫాస్ట్‌గా దూసుకొచ్చేస్తున్నాడు. అభిమానులంతా ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారో.. అంతే వేగంగా ఆన్‌సెట్స్ అహర్నిశలు శ్రమించాడు. అక్టోబర్ 22 .. విజయదశమి లక్ష్యంగా తన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ముహూర్తం ఇప్పటికే ఫిక్స్ చేసేశారు.
లేటెస్టుగా థాయ్‌ల్యాండ్‌లో షూటింగ్ పూర్తయింది. కీలకమైన యాక్షన్ సన్నివేశాలు సహా మెజారిటీ భాగం టాకీ చిత్రీకరణలు పూర్తి చేశారు. బ్యాలెన్స్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా చెప్పాడు అఖిల్. ట్విట్టర్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. త్వరగా హైదరాబాద్‌లో వాలిపోయి హలీమ్‌ని టేస్ట్ చేయాలని ఉందన్నాడు. ఈ స్పీడ్ చూస్తుంటే అఖిల్ ఆరంగేట్రమే అదరగొట్టేసేట్టున్నాడు.
అఖిల్ సినిమాకి ఇప్పట్నుంచే మార్కెట్‌లోనూ స్పీడ్ పెరిగిందని సమాచారం. అన్ని వైపుల నుంచి బయ్యర్లు సూట్‌కేసులతో రెడీ అవుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే నాగార్జున, నాగచైతన్యలకు లేని క్రేజ్ అఖిల్‌కి ఉందని అంటున్నారు. వస్తూనే సంచలనాలకు తెరతీయడం ఖాయమని చెబుతున్నారు. అసలే వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమా. పైగా అఖిల్ డెబ్యూ లుక్ గ్రాండ్. ఇప్పటికే మేకింగ్ వీడియోలతో అదరగొట్టేశాడు. ఇవన్నీ అతడికి పెద్ద ప్లస్ అయ్యి మార్కెట్ పరిగెత్తుతోందని తెలుస్తోంది.