అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ ప్రిన్స్ గా 'అఖిల్' సినిమా తో అఖిల్ కు వెల్ కమ్ చెప్పారు. దురదృష్టం కొద్ది ఆ సినిమా నిరాశ పర్చింది. అయినా కూడా అఖిల్ పై ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకుని ఎదురు చూశారు. వరుసగా మూడు సినిమాలు కూడా అఖిల్ కు నిరాశనే మిగిల్చాయి.. అభిమానులు కూడా ఇంకా ఎదురు చూపుల్లో ఉండగా మొన్న దసరాకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అఖిల్ కు ఎట్టకేలకు కమర్షియల్ బ్రేక్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై వరుసగా అఖిల్ నుండి బ్లాక్ బస్టర్ లు ఖాయం అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇదే సమయంలో అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా ప్రచారం మొదలు అయ్యింది.
చూడ్డానికి బాలీవుడ్ హీరోల కనిపించే అఖిల్ ఖచ్చితంగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే కుమ్మేయడం ఖాయం అంటూ కొందరు చాలా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఇప్పట్లో ఉండదని తేలిపోయింది. ఆ విషయాన్ని స్వయంగా అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ నాకు తెలుగు సినిమా పరిశ్రమ అంటే ఇష్టం. కనుక నేను ఇక్కడే సినిమాలు చేస్తాను కాని ఇప్పట్లో మరే భాషలో కూడా సినిమాలు చేయాలనుకోవడం లేదు అంటూ స్పష్టతను ఇచ్చాడు. అయితే అఖిల్ నటించబోతున్న సినిమాలు మాత్రం ముందు ముందు వేరే భాషల్లో డబ్బింగ్ అవ్వడం ఖాయం అంటున్నారు.
ఈమద్య కాలంలో తెలుగు హీరోలకు పాన్ ఇండియా గుర్తింపు లభిస్తోంది. వారు ఎంపిక చేసుకున్నటున్న కథలు మరియు దర్శకుల వల్ల పాన్ ఇండియా స్టార్ డమ్ ను దక్కించుకోవడంతో పాటు ఆయా భాషల్లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ డైరెక్ట్ హిందీ సినిమాకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ హిందీ సినిమాను చేస్తున్నాడు. మరికొన్ని నటించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొందరు కూడా డైరెక్ట్ హిందీ సినిమాలను చేస్తారనే టాక్ వినిపిస్తుంది. కాని అఖిల్ మాత్రం ఇప్పట్లో బాలీవుడ్ ఎంట్రీ లేదు.. ప్రస్తుతానికి టాలీవుడ్ లోనే హీరోగా నటించడం అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తర్వాత అఖిల్ 'ఏజెంట్' గా రాబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.