అక్కినేని వారసుడు అఖిల్ కథానాయకుడిగా స్టైలిష్ ఫిలంమేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` అత్యంత భారీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏజెంట్ లో అఖిల్ లుక్ ఇప్పటికే సినిమాకి కావాల్సినంత ప్రచారాన్ని తెచ్చి పెట్టింది. సిక్స్ ప్యాక్ లో అఖిల్ లుక్ సూపర్బ్ అంటూ మంచి కామెంట్లు పడ్డాయి. ఇదొక స్పై థ్రిల్లర్ అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. వైజాగ్ పోర్టులో వెలుగు చూసిన హానీట్రాప్ నేపథ్యం అని మరోవైపు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులోనే జరిగింది. ఇక ఇటీవలే మరో షెడ్యూల్ వైజాగ్ పోర్టులోనూ ప్లాన్ చేసారు.
దాదాపు వైజాగ్ షెడ్యూల్ కూడా పూర్తయింది. షూట్ లో భాగంగా ఏజెంట్ టీమ్ విశాఖ కోస్టల్ బెల్ట్ మొత్తం చుట్టేసినట్లు ప్రచారంలో ఉంది. ఇక హైదరాబాద్ లోనూ కొంత షూటింగ్ చేసారు. తాజాగా యూనిట్ విదేశాలకు పయనం అవుతున్నట్లు సమాచారం. యూరప్ లోని బుడాఫెస్ట్ లో కీలక షెడ్యూల్ వేసినట్లు తెలిసింది. అక్టోబర్ నుంచి షూటింగ్ బుడాఫెస్ట్ లోనూ జరుగుతుందని సమాచారం. అక్కడి షెడ్యూల్ పూర్తి చేసిన అనంతరం యూనిట్ తిరుగు ప్రయాణం మొదలవుతుంది. అక్కడ నుంచి యథావిధిగా హైదరాబాద్ లో బ్యాలెన్స్ షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కు భారీగానే బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. 40కోట్లకు పైగానే వెచ్చించినట్లు సమాచారం.
అఖిల్ కి అంత స్టామినా లేకపోయినా స్టార్ మేకర్ పై ఉన్న నమ్మకంతోనే నిర్మాతలు ధైర్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకూ ఒక్క పెద్ద హిట్ కూడా లేదు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఎలాగైనా సక్సెస్ అందుకుని మార్కెట్ బిల్డ్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాడు. మరి అఖిల్ ఆశ బ్యాచిలర్ అయినా నిలబెడుతుందేమో చూడాలి.