అఖిల్‌ .. అసలు కథ ఏమై ఉంటుంది?

Update: 2015-08-30 13:43 GMT
అఖిల్‌ టీజర్‌ వచ్చింది. 'అఖిల్‌' - ది పవర్‌ ఆఫ్‌ జువా .. అంటూ టీజర్‌ లో చేసిన హడావుడి బావుంది. నిన్నటిరోజున సల్మాన్‌ ఖాన్‌ చేతులమీదుగా అక్కినేని హీరో టీజర్‌ లాంచ్‌ అయ్యింది. దీంతో అసలు ఎవరీ చురకత్తి? అంటూ అటు బాలీవుడ్‌ లోనూ ఆరాలు మొదలయ్యాయి. అయితే అఖిల్‌ టీజర్‌ చూసినవారికి కొన్ని సందేహాలొచ్చాయి.

టీజర్‌ లో వినాయక్‌ ఏం చెప్పదలుచుకున్నారు? కథని రివీల్‌ చేయలేదు. ఇది ఫాంటసీ అన్న సంగతినీ చూపించలేదు. అసలు అఖిల్‌ డ్యాన్సులు ఎలా ఉంటాయో ఓ చిన్న బిట్‌ కూడా మెరిపిించలేదు. పోనీ పంచ్‌ లేవైనా వేస్తాడా? అంటూ అదీ లైట్‌ తీస్కున్నారు. కేవలం అఖిల్‌ లోని మెరుపులాంటి వేగాన్ని మాత్రమే చూపించాడు. జస్ట్‌ యాక్షన్‌ పార్ట్‌ తో ఝలక్‌ ఇచ్చాడంతే. అఖిల్‌ లోని వేగం చిరుతని మించి ఉంటుంది అన్న సిగ్నల్స్‌ ఇచ్చాడు. కానీ అదే టీజర్‌ లో ఇసుమంత కథ గురించి కానీ, డ్యాన్స్‌ బిట్‌ ని కానీ, ఓ చిన్న డైలాగ్‌ ని కానీ యాడ్‌ చేసి ఉంటే ఇంకా బావుండేదే అని అనుకున్నారంతా.         

అఖిల్‌ లోని వేగం నచ్చినా కొంతవరకూ టీజర్‌ లో క్లారిటీ మిస్సయ్యిందన్న విమర్శలొచ్చాయి. అయినా అప్పుడే తొందరెందుకు? ముందుందిగా ముసళ్ల పండుగ. త్వరలోనే ఆడియో రిలీజ్‌ కాబోతోంది. ఆ వేదికపైనే పూర్తి ట్రైలర్స్‌ వస్తాయి. పాటల్లోని మెరుపులు చూసే ఛాన్సుంది. అప్పుడే.. అఖిల్‌ లోని విషయం ఎంతో తేలిపోతుంది. వెయిట్‌ అండ్‌ సీ.

Tags:    

Similar News