విక్రమ్ సినిమాతో 1986 లో ఇండస్ట్రీకి పరిచయం అయిన అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి నాగార్జున ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జునగా మారిపోయాడు. విక్రమ్ గా సినీ ప్రయాణంను నాగార్జున మొదలు పెట్టి మూడున్నర దశాబ్దాలకు పైగా పూర్తి అయ్యింది. ఆయన సినీ ప్రస్థానం ఓ అద్బుత జర్నీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగార్జున శివ సినిమా మొదలుకుని ఎన్నో ప్రయోగాలను చేసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడమే కాకుండా తన తండ్రి ప్రారంభించిన అన్నపూర్ణ స్టూడియోస్ ను మరియు బ్యానర్ ను పెరుగుతున్న సాంకేతికత అద్దుతూ అభివృద్ది చేయడం జరిగింది. నాగార్జున ఏ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఈ వయసులో కూడా మీరు ఇలా ఎలా కనిపిస్తున్నారు అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంది.
ఇద్దరు కొడుకులు హీరోలుగా తెరంగేట్రం చేసినా కూడా నాగార్జున ఇంకా నవ మన్మధుడిగానే కనిపిస్తున్నాడు అంటూ ఆయన అభిమానులు.. ముఖ్యంగా లేడీ అభిమానులు అంటూ ఉంటారు. ఆరు పదుల వయసు దాటినా కూడా ఆయన మూడు పదుల యువకుడిగా సినిమాలు చేయడంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మూడున్నర దశాబ్దాల సినీ కెరీర్ లో ఆయన చేసిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కొన్ని నిరాశ పర్చినా కూడా మంచి అనుభవాలను నేర్పించాయని ఆయన అంటూ ఉంటారు. తన సినీ కెరీర్ ను మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా మల్చుకుంటూ వచ్చిన నాగార్జున దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్ లో టాప్ 4 హీరోల జాబితాలో కొనసాగాడు.
ఇతర హీరోలతో కలిసి నటించేందుకు ఎప్పుడు సిద్దంగా ఉండే నాగార్జున ఈ 35 ఏళ్లలో పలు మల్టీ స్టారర్ సినిమాలను కూడా చేశాడు. ఈ వయసులో కొందరు హీరోలు సాహసాలు చేసేందుకు ఆసక్తి చూపించరు. కాని నాగార్జున మాత్రం వైల్డ్ డాగ్ వంటి అడ్వంచర్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా అలాంటి అడ్వంచర్ మూవీనే అంటూ వార్తలు వస్తున్నాయి. మరో వైపు బంగార్రాజు సినిమాలో మళ్లీ తన రొమాంటిక్ యాంగిల్ ను నాగార్జున చూపించబోతున్నాడు. కొడుకులకు పోటీగా నాగార్జున కొనసాగుతున్నాడు. 35 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న నాగార్జునకు మా.. మీ తరపున హృదయ పూర్వక అభినందనలు.