అక్కినేని నాగ చైతన్య- సమంతల రిసెప్షన్.. హైద్రాబాద్ లో గ్రాండ్ లెవెల్ లో జరిగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి మాత్రమే కాదు.. దాదాపు వారితో పరిచయం ఉన్న ప్రముఖులు అందరూ ఈ ఈవెంట్ లో కనిపించారు. నూతన వధూవరులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు.
అయితే.. ఈ రిసెప్షన్ లో అందరూ ఆసక్తిగా గమనించిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆమె ఎవరో కాదు.. అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల. అంటే చైతుకు మేనత్త అన్న మాట. సమంతకు పిన్ని అవుతారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి వేడుకలకు దగ్గర దూరం అనే బేధం లేకుండా.. బోలెడంత మంది బంధువులు కూడా రావడం సహజం. అయితే.. ఈ తరం కుర్రకారుకు అందరూ తెలియకపోవచ్చు. ముఖ్యంగా అక్కినేని ఇంటికి కొత్తగా వస్తున్న సమంతకు అసలు తెలిసే ఛాన్స్ లేదు. కానీ ఈ రిసెప్షన్ లో చాలాసేపు ఆ జంట పక్కనే కనిపించిన నాగ సుశీల.. వచ్చిన ప్రతీ ఒక్కరినీ పరిచయం చేశారు. వీరిలో చాలామంది చైతుకు కూడా తెలియదనే విషయం అక్కడ అర్ధమవుతోంది కానీ.. ఇంతగా కేర్ తీసుకునే మేనత్తలు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి.
ఇక ఈ రిసెప్షన్ లో చైతు-సమంతల డ్రెసింగ్ తో పాటు బిహేవియర్ అందరినీ తెగ ఆకట్టుకుంది. ఎంతమంది అతిథులు వచ్చినా.. వారందరినీ సాదరంగా ఆహ్వానించి.. ఫోటోలు దిగి మరీ పంపించిన తీరును అంతా అభినందిస్తున్నారు.