ఏ కుర్ర నటి కూడా చేయని సాహసాన్ని చేశారు అక్షరాహాసన్. కమల్ హాసన్ గారాలపట్టిగా సుపరిచితురాలైన ఆమె నటిగా ఇప్పటివరకూ చేసింది నాలుగు సినిమాలే. అయితే.. ఆ నాలుగు సినిమాల్లో రెండింటిలో ప్రెగ్నెంట్ గా నటించటం మాత్రమే ఆమెకే చెల్లుతుంది. నటిగా తొలిదశలోనే క్లిష్టమైన ప్రెగ్నెంట్ పాత్రను పోషించటం.. సినిమా మొత్తం అలానే కనిపించటం మామూలు విషయం కాదు.
అయితే.. తన నటనతో మెప్పించింది అక్షర. మిగిలిన పాత్రలకు గర్భవతి పాత్ర చేసేటప్పుడు ఒళ్లు చేయాల్సి రావటం.. ప్రెగ్నెంట్ లా చేయటం అంత సులువైన విషయం కాదు. తొలిసారి ప్రెగ్నెంట్ గా చేసినప్పుడు.. సెన్సిబులిటీ అర్థం కాలేదని.. రెండోసారి చేసేటప్పుడు మాత్రం కాస్త అర్థమైనట్లు చెప్పింది.
తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ప్రెగ్నెంట్ ఉమెన్ గా ఎలా చేయాలి? అందుకు సంబంధించిన సలహాల్ని తన తల్లిని అడిగినట్లు చెప్పారు. మనం నిజంగా ప్రెగ్నెంట్ అయితేనే పూర్తిగా అర్థమవుతుందన్న ఆమె.. గర్భవతులు ఎలా నడుస్తారు? ఎలా కూర్చుంటారు? లాంటి విషయాల్ని తన తల్లిని అడిగి తెలుసుకున్నానని చెప్పారు.
ప్రెగ్నెంట్ ఉమెన్ టక్కున లేచి నిలబడలేరని.. అదే రీతిలో కూర్చోవటం కుదరదని.. చాలా మెల్లిగా లేవటంతో పాటు.. కదలికలు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు.. స్టేట్ ఆఫ్ మైండ్ గా అభివర్ణించిన అక్షర.. ప్రెగ్నెంట్స్ కు ఉండే భయాలు.. ఎగ్జైట్ మెంట్ గురించి తెలిసినప్పుడు మాత్రమే ఆ పాత్రలోకి వెళ్లగలుగుతామని చెప్పిన తీరు చూస్తే.. ఇంతలా శ్రమించటం వల్లే మిస్టర్ కేకే చిత్రంలో .. ప్రెగ్నెంట్ గా ఆమె తన పాత్రలో జీవించిందని చెప్పక తప్పదు.