భార్య‌ను దారుణంగా అవ‌మానించిన హీరో

Update: 2019-12-20 04:05 GMT
కెన‌డా పౌర‌స‌త్వం పొందిన బాలీవుడ్ హీరో కిలాడీ అక్ష‌య్ కుమార్ గ‌త కొంత కాలంగా భార‌తీయ పౌర‌స‌త్వం కోసం ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందుకోసం బీజేపీకి వంత‌ పాడుతున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌కులు అత‌డిపై తారా స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. బీజేపీ అనుబంధ సంస్థ ఆర్.ఎస్.ఎస్‌తోనూ మంచి స్నేహాన్ని కొన‌సాగిస్తున్న అక్ష‌య్ ఉన్న‌ట్టుండి ఓ సెక్ష‌న్ కి విల‌న్ గా మారిపోయారు. పౌర‌స‌త్వ బిల్లు చ‌ట్ట విరుద్ధం అంటూ దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చెల‌రేగుతున్న ఈ స‌మ‌యంలోనే ఇటీవ‌ల దిల్లీ జ‌మియా మిలియా ఇస్లామియా వ‌ర్సిటీ విద్యార్థుల ఆందోళ‌న‌లు తెలిసిందే.

ముస్లిమ్ విద్యార్థుల‌పై పోలీసుల దాడిని స‌మ‌ర్ధించేలా.. ఓ పోస్ట్ ని అక్ష‌య్ లైక్ చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది. భాజ‌పా ప్ర‌భుత్వానికి అనుకూల‌త‌ను వ్య‌క్తం చేయ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. దీనిపై నెటిజ‌నులు తీవ్ర‌ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ అక్ష‌య్ ని ట్రోల్ చేస్తున్నారు. రోజు రోజుకీ అక్ష‌య్ పై నెటిజ‌నం ఊగిపోతున్నారు.

ఇదిలా వుంటే అక్ష‌య్ మ‌రో వివాదంలోనూ చిక్కుకున్నారు. వైఫ్ ట్వింకిల్ ఖ‌న్నాతో క‌లిసి ఓ టీవీ చానెల్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఇందులో ప‌లు విష‌యాల‌పై మాట్లాడిన అక్ష‌య్ భార్య ట్వింకిల్ ఖ‌న్నా ర‌చ‌న‌ల్ని తీసిక‌ట్టుగా తీసిపారేయ‌డం వీక్ష‌కుల్ని విస్మ‌య‌ప‌రిచింది. త‌న భార్య ఎన్నో పుస్త‌కాలు రాసింద‌ని.. అయితే వాటిని తాను ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ద‌వ‌లేద‌ని.. త‌న ఆలోచ‌న‌ల్ని అర్థం చేసుకునేంత‌గా తాను చ‌దువుకోలేద‌ని ప‌బ్లిగ్గా త‌న భార్య ట్వింకిల్ ని అవ‌మానించ‌డంతో అక్ష‌య్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముక్కుసూటిగా మాట్లాడినా ఇలా అవ‌మానించాల్సింది కాద‌న్న అభిప్రాయాలు సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇక కిలాడీ కెరీర్ ని ప‌రిశీలిస్తే.. ఖాన్ ల త్ర‌యాన్ని సైతం వెన‌క్కి నెట్టి 2019ని త‌న ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఒక్క ఏడాదిలో 1000 కోట్ల వ‌సూళ్ల‌ క్ల‌బ్‌లో చేరిన అక్ష‌య్ అంతే వేగంగా జ‌నాల దృష్టిలో ప‌త‌నం అవ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇటీవ‌ల అక్ష‌య్ న‌టించిన `హౌస్‌ఫుల్ 4` బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోయ‌నా వ‌సూళ్లు ఫ‌ర్వాలేద‌నిపించింది. ఈ శుక్ర‌వారం `గుడ్ న్యూజ్‌` సినిమా రిలీజ్ కానుంది.
Tags:    

Similar News