ఈ ఆదివారం కలక్షన్లతో.. కేవలం ఇండియా బిజినెస్ మాత్రమే 102 కోట్లను టచ్ అయ్యింది. అది ''రుస్తుం'' లెక్క. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు మామూలు దూకుడు మీద లేడనుకోండి. అయితే కామెడీ సినిమాలు.. లేదంటే సీరియస్ పేట్రియాటిక్ సినిమాలు.. ఇలా అదొకటీ ఇదొకటీ చేసుకుంటూ వెళుతూ మనోడు ఉతికి ఆరేస్తున్నాడు.
మొన్ననే దర్శకుడు నీరజ్ పాండేతో కలసి అక్షయ్ కుమార్ నిర్మించిన రుస్తుం రిలీజైంది. ఖైదు చేయబడి, దేశం నుండి వెళ్ళిపోయిన ఒక నేవీ ఆఫీసర్ నిజ జీవితపు కథతో రూపొందిన ఈ సినిమా రిలీజైందో లేదో.. అసలు అక్షయ్ యునిఫామ్ లో చాలా తప్పులున్నాయని.. పెట్టుకున్న బ్యాడ్జీ నుండి.. పెంచిన మీసం వరకు అన్నీ రాంగే అంటూ క్రిటిక్స్ చాలా హంగామానే చేశారు. కాని సినిమా మాత్రం రోజురోజుకూ కలక్షన్లలో తన సత్తా చాటుకుంటూ పోయింది. ఇదే రోజున విడుదలైన హృతిక్ రోషన్ మొహంజొదారో మాత్రం 55 కోట్ల నెట్ కలక్షన్ తో ఇండియాలో చతికిలపడిందనే చెప్పాలి.
అసలు ఈ సంవత్సరం అక్షయ్ కుమార్ ఏ సినిమాతో వచ్చినా కూడా.. రఫ్ఫాడించేస్తున్నాడు. ఇప్పటికే ఎయిర్ లిఫ్ట్.. హౌస్ ఫుల్ 3 సినిమాలతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంటరై.. ఇప్పుడు ఏకంగా రుస్తుం సినిమాతో హ్యాట్రిక్ కొట్టేశాడు. దటీజ్ అక్షయ్.