కాస్టింగ్ కౌచ్.. మహిళలపై వేధింపులు అంశం ఇప్పుడు టాలీవుడ్ లో మాంచి కాక మీద ఉంది కానీ.. నిజానికి ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. #MeToo అంటూ హాలీవుడ్ సహా అనేక దేశాలకు చెందిన తారలు ఈ ఉద్యమంలో భాగం అవుతున్నారు.
ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఈ వివాదం స్టార్ట్ అయిపోయింది. తాను కూడా సెక్సువల్ హెరాస్మెంట్ కు గురయినట్లు.. పాక్ నటి మీషా షఫీ చెప్పుకొచ్చింది. పరిశ్రమలో తన కొలీగ్ అయిన ఆలీ జాఫర్.. భౌతికంగా లైంగిక హింసకు గురి చేశాడని వెల్లడించింది. ఇండస్ట్రీలోకి వచ్చినపుడు మాత్రమే కాదని.. తాను శక్తివంతమైన మహిళగా మారినపుడు.. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన తర్వాత కూడా ఈ లైంగిక వేధింపులు జరిగాయని చెప్పింది మీషా షఫీ. ఓ పాకిస్తాన్ నటి.. తన తోటి నటుడిపై ఇంతటి ఆరోపణలు చేయడం పాక్ లో పెద్ద వివాదం అయింది. కిల్ దిల్.. మేరే బ్రదర్ కి దుల్హన్ వంటి చిత్రాలతో మన ప్రేక్షకులకు కూడా పరిచితం అయిన ఆలీ జాఫర్ కూడా స్పందించాడు.
తనపై వచ్చిన ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పాడు. తనకు ఓ కూతురు ఉందని.. తాను బాధ్యతాయుతమైన వ్యక్తిని అన్నాడు ఆలీ జాఫర్. ఇదంతా పూర్తిగా పాకిస్తాన్ కు సంబంధించిన విషయం. ఇక్కడ శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి.. పాక్ లో జరిగిన అంశానికి లింక్ ఒక్కటే. లైంగిక వేధింపులు అన్న పాయింట్ మాత్రమే లింక్. మరి నక్కకి నాగలోకానికి లింకులు వేసే మన మీడియా ఛానల్స్.. ఇప్పుడు ఈ పాకిస్తాన్ సెక్సువల్ హెరాస్మెంట్ అంశాన్ని శ్రీరెడ్డి ఖాతాలో వేసేందుకు ఎలా ప్రయత్నిస్తాయో చూడాలి.