రాజ‌మౌళికే షాక్ ఇచ్చిన‌ చిల్లు బుగ్గ‌ల భామ‌

Update: 2021-12-19 06:54 GMT
చిల్లు బుగ్గ‌ల బ్యూటీ ఆలియాభ‌ట్ ద‌ర్శ‌క‌ధీరునికే షాక్ ఇచ్చింద‌ట‌. ఆ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం జ‌క్క‌న్న అండ్ టీమ్ తో ఆలియా RRR చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సీత పాత్రను పోషించిన ఆలియా వేదిక‌పై చీర‌క‌ట్టులో మెరుపులు మెరిపిస్తోంది.

అయితే తాజాగా బ్రహ్మాస్త్ర సినిమా హైదరాబాద్ ప్రెస్ మీట్ లో అలియా పొట్టి డ్రెస్ లో ప్ర‌త్య‌క్ష‌మై మైండ్ బ్లాక్ చేయ‌డంతో జ‌నం షాక్ తిన్నారు. ఇన్నాళ్లు చీర‌లో సీత‌మ్మ‌లా క‌నిపించినా ఆలియా ఉన్న‌ట్టుండి అలా క‌నిపించ‌డం అంద‌రికీ షాకిచ్చింది. నీలిరంగులో మెరిసే స్వెటర్ లాంటి టాప్ .. పొట్టిగా మెరిసే రెక్సిన్ స్కర్ట్ అలియా ధ‌గ‌ధ‌గ‌లాడింది. ఇక ఈ డ్రెస్ లో తనను చూసి రాజమౌళి షాక్ అయ్యాడని అలియా చెప్పింది. బ్ర‌హ్మాస్త్ర వేదిక‌పై తెలుగులో మాట్లాడుతూ ఆక‌ట్టుకుంది. ``అందరికీ నమస్కారం? బాగున్నారా?`` అని ప్ర‌శ్నిస్తూ.. బ్రహ్మాస్త్ర ఒక ప్రత్యేక చిత్రం. ఈ సినిమా మా అందరి కష్టం. అందరికీ సూపర్ ఆనందం అందిస్తుంది! అని తెలిపింది. RRR చిత్రంతో పాటు తన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర ప్ర‌చారాన్ని కానిచ్చేస్తున్న ఆలియా గ‌డుస‌రి త‌నం హాట్ టాపిక్ గా మారింది. ఆస‌క్తిక‌రంగా  రాజమౌళి బ్రహ్మాస్త్రతో పాటు దక్షిణాది భాషలకు ఈ చిత్రానికి స‌మ‌ర్కునిగా అనుబంధం కలిగి ఉండటంతో అలియా అండ్ టీమ్ కి అది పెద్ద ప్ల‌స్ కానుంది. ద‌క్షిణాదిలో రాజ‌మౌళి వ‌ల్ల బ్ర‌హ్మాస్త్ర‌కు బోలెడంత ప్ర‌చారం ద‌క్కుతోంది. బ్ర‌హ్మాస్త్ర‌కు క‌ర‌ణ్ జోహార్ ఒక నిర్మాత అన్న సంగ‌తి తెలిసిందే. ర‌ణబీర్-ఆలియా-ఆయ‌న్ ముఖ‌ర్జీ-క‌ర‌ణ్ జోహార్ - రాజ‌మౌళి ఒకే వేదిక‌పై క‌నిపించి సంద‌డి చేసారు.
Tags:    

Similar News