అగ్గి రాజేసిన RRR బ్యూటీ బులుగు బికినీ

Update: 2022-03-07 04:05 GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ RRR తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం బ‌హుభాష‌ల్లో ఈ నెల 25 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఓవైపు గంగూభాయి క‌తియావాడీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. దీంతో ఆలియా క్రేజ్ మ‌రింత‌గా పెరిగింది. ఇక సోష‌ల్ మీడియాల్లో ఇదే అద‌నుగా ఆలియా తుఫాన్ లా విరుచుకుప‌డుతోంది.

వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ నిరంత‌రం వేడెక్కిస్తోంది. తన తాజా ఫోటోషూట్ లో అలియా అలా బీచ్ లో బికినీలో చిద్విలాసంగా క‌నిపిస్తోంది. ఈ ఆకర్షణీయమైన స్నాప్ లో క్యూటీ నిజంగా చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఆలియా సోషల్ మీడియా అనుచరులు అంతకు మించి త‌న నుంచి ఇంకేం ఆశిస్తారు?

అలియా నాజూకైన శరీరాకృతి బిగ్ గిఫ్ట్ అనే చెప్పాలి. అయితే ఈ రూపం అంత వీజీ కానేకాదు. దానిని కొనసాగించడానికి జిమ్ లో చెమటలు పట్టిస్తుంది. ఆమెకు బాగా సరిపోయే బికినీ ధ‌రించి ప‌రువాల విందు చేస్తోంది.

సంచలనాత్మక న‌టి గ్లామర్ ట్రీట్ ఆ లెవ‌ల్లో యూత్ కి కిక్కెక్కిస్తోంది.  అలియా భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లోని అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా కూడా పరిగణించబడుతుంది. త‌దుప‌రి జూనియర్ ఎన్టీఆర్  - రామ్ చరణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న‌ RRR లో క‌థానాయిక‌గా నటిస్తోంది.

ఈ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనను ప్రదర్శించిందని స‌మాచారం. RRRలో సీతగా అభిన‌యిస్తోంది. క‌నిపించేది 20 నిమిషాలే అయినా ఎంతో ప్ర‌భావం చూపిస్తుంద‌న్న టాక్ ఉంది.


Tags:    

Similar News