ఫలక్ నుమ ప్యాలస్ లో సేదతీరుతుందట..!

Update: 2015-06-26 07:45 GMT
సాధారణంగా ఎవరికైనా గాయలైతే ఆసుపత్రిలో అడ్మిట్ అవుతారు లేదా చికిత్స చేయించుకుని ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటారు. నేను మాత్రం ఫలక్ నుమ ప్యాలస్ లో సీదతీరుతా అంటోంది ఆలియా భట్. పసిప్రాయపు రూపురేఖలు, పడుచుప్రాయం లోని వంపుసొంపులతో దేశ వ్యాప్తంగా కుర్రకారు గుండెల్లో తిష్ట వేసుక్కూర్చున్న ఈ బాలీవుడ్ బామ ఇలా ఎందుకు అంటోందో మీరే చదవండి.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, టూ స్టేట్స్ లాంటి సినిమాల్లో నటించిన ఆలియా ప్రస్తుతం తనను పరిచయం చేసిన కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న కపూర్ అండ్ సన్స్ సినిమాలో నటిస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రిషి కపూర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లో ఆలియా భుజానికి గాయమైంది. వైద్యుల సూచన మేరకు కొద్ది రోజుల పాటు షూటింగ్ కు సెలవు ప్రకటించి భాగ్యనగరాన్ని చుట్టేయడానికి రెడీ అయిపొయింది.

ఆలియ ఎప్పుడో పదిహేనేళ్ళ కిందట హైదరాబాద్ వచ్చిందట. ఇక్కడికి వచ్చిన ప్రముఖులెవరైనా ఫలక్ నుమ ప్యాలస్ కట్టడాన్ని మళ్ళీ మళ్ళీ చూడలనుకుంటారు. ఆలియా అలానే అనుకున్నా అది నెరవేరే సరికి పదిహేనేళ్ళు పట్టిందని వాపోతుంది. ఆ రకంగా ఈ సెలవుల్లో తన కోరికను నెరవేర్చుకునేందుకు కుటుంబంతో సహా హైదరాబాద్ వస్తోంది. అబ్బాయిలూ ఈ ఇరవై రెండేళ్ళ పడుచు పిల్లని ఇబ్బంది పెట్టకండే...!!               
Tags:    

Similar News