ట్రెండీ టాక్‌: న‌య‌న్ పై అవ‌న్నీ గాసిప్పులే..!

Update: 2021-02-20 05:30 GMT
గ‌త కొంత‌కాలంగా హ‌బ్బీ విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కిస్తున్న `కాతు వాక‌ల రెండు కాదల్` సినిమాతో న‌య‌న‌తార బిజీబిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో సేతుప‌తి- స‌మంత ఇత‌ర‌ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాతా న‌య‌న్ ప‌లు త‌మిళ చిత్రాల‌కు సంత‌కాలు చేశారు.

ప‌నిలో ప‌నిగా టాలీవుడ్ నుంచి ఏదైనా క్రేజీ ఆఫ‌ర్ త‌న‌ని వ‌రిస్తే వ‌దిలేందుకు సిద్ధంగా లేర‌న్న‌ది తెలిసిన‌దే. ఇంత‌కుముందు సీనియ‌ర్ హీరోలు బాల‌కృష్ణ‌.. చిరంజీవి స‌ర‌స‌న న‌య‌న్ న‌టించారు. సింహా లో బాల‌య్య స‌ర‌స‌న‌.. సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న న‌టించారు. వెంకీ- నాగార్జున లాంటి వెట‌ర‌న్ ల‌కు న‌య‌న్ ఒక ఆప్ష‌న్.

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి క‌థానాయకుడిగా మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ లూసీఫ‌ర్ లో న‌య‌న‌తార ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తార‌ని.. త‌న‌కు భ‌ర్త పాత్ర‌ధారి(విల‌న్‌)ని వెతుకుతున్నార‌ని గ‌త కొంత‌కాలంగా ప్ర‌చార‌మ‌వుతోంది. మ‌రోవైపు న‌య‌న్ కి కాల్షీట్లు స‌ర్ధుబాటు కాలేద‌న్న గుస‌గుస‌లు కొన్ని మీడియాల్లో వినిపించాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం.. న‌య‌న్ ఈ చిత్రంలో న‌టిస్తున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం రానుంద‌ట‌. ఈ సినిమా రీమేక్ ప‌నులు ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా సాగుతున్నాయి.
Tags:    

Similar News