ఎస్.ఎస్.థమన్ .. ఈ పేరు ఇప్పుడు అంతటా మార్మోగుతోంది. టాలీవుడ్ సర్కిల్స్ లో థమన్ అంటేనే ఒక బ్రాండ్ అన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు దశాబ్ధం పైగా కెరీర్ ని రన్ చేస్తున్నా ఏనాడూ ఇంతగా అతడి పేరు వినిపించలేదు. 2020లో అల వైకుంఠపురములో మ్యూజిక్ అతడి రేంజును అమాంతం స్కైలోకి లేపిందనే చెప్పాలి.
అప్పటివరకూ తనపై ఉన్న అన్ని విమర్శలను తుడిచేసుకుని థమన్ తనలోని సరికొత్త మ్యూజీషియన్ ని పరిచయం చేశాడు. క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ హోదాని అందుకున్నాడు. రెహమానో హారిస్ జైరాజో యువన్ శంకర్ రాజానో వస్తే కానీ కొత్త ట్యూన్లు వినపడవు అన్న బ్యాడ్ ట్రెండ్ నుంచి నెమ్మదిగా థమన్ లాంటి వాళ్లు కొత్త ట్రెండ్ క్రియేట్ చేయడం ఆసక్తిని పెంచింది. ఇక టాలీవుడ్ లో దేవీశ్రీ లాంటి ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా థమన్ తన హవాను అంతకంతకు పెంచుకుంటూ సత్తా చాటుతున్నాడు.
అదంతా సరే కానీ.. థమన్ ఇప్పటికిప్పుడు ఓవైపు మహేష్ కి మరోవైపు పవన్ కి పని చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలోని సర్కార్ వారి పాటకు స్వరాలు రెడీ చేస్తున్నాడు. సేమ్ టైమ్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ కి అతడే సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగానే పవన్ వెంటనే మరో ఆఫర్ ఇవ్వడం సర్వాత్రా చర్చనీయాంశమైంది. పవన్ కథానాయకుడిగా తెరకెక్కనున్న అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ కి థమన్ సంగీతం అందించనున్నారు. సాగర్ చంద్ర అండ్ సితార బృందం అతడిని సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసుకున్నారట. ఇక ఈ ఆఫర్ రావడానికి కారకుడు మాత్రం ఈ మూవీకి మాటలందిస్తున్న మాయావి త్రివిక్రమ్ శ్రీనివాస్ రికమండేషన్ అని కూడా తెలిసింది. అయితే అల... పాటలతో సత్తా చాటిన థమన్ కి ఆఫర్ ఇచ్చేందుకు ఇప్పుడు పవన్ కానీ ఇంకెవరూ కానీ అభ్యంతరం చెప్పరు. పవన్ - రానా కథానాయకులుగా ఈ రీమేక్ తెరకెక్కుతుండగా ఇప్పటిక సాయి పల్లవి- ఐశ్వర్యారాజేష్ లను కథానాయికలుగా ఫైనల్ చేశారన్న సమాచారం ఉంది. ఇక పవన్ .. మహేష్.. బన్ని.. చరణ్ ..తారక్ ఇలా అందరూ థమన్ వెంటే పడుతున్నారు మరి.