కామెడీ హీరో అల్లరి నరేష్ సినీ రంగ ప్రవేశం చేసి 14 ఏళ్లు పూర్తయింది. 2002 మే 10వ తారీఖున రవిబాబు చేయించిన అల్లరితో తెలుగు సినీ రంగానికి ఓ కొత్త కామెడీ హీరో పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ సాధించడంతో.. తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆ అల్లరోడు.
'14 ఏళ్ల క్రితం అల్లరితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మా ప్రయాణం మొదలైంది. మీ అభిమానానికి మద్దతుకు కృతజ్ఞతలు, ఈ ప్రయాణం అద్భుతమైనది' అంటూ నరేష్ ట్వీట్ చేశాడు. ఇప్పటికి అల్లరి నరేష్ నటించిన 50 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఇతగాడు పరిచయం చేసినంత మంది హీరోయిన్లు - బహుశా ఏ హీరో కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఉండడు. అసలు చేసిన హీరోయిన్ తో మళ్లీ సినిమా చేయకుండా కూడా చాలా ఏళ్ల పాటు ప్రయాణం సాగించాడు మన కామెడీ హీరో. గత కొన్నేళ్లుగా సక్సెస్ విషయంలో వెనకబడ్డా.. మళ్లీ తిరిగి తన సత్తా చాటేందుకు ఓ దెయ్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
'మా ఇంట్లో దెయ్యం నాకెందుకు భయం' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తుండగా.. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. కామెడీ హీరోగా టాప్ ప్లేస్ లో ఉంటూనే.. నేను - గమ్యం లాంటి విభిన్నమైన చిత్రాలను కూడా చేసి తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు అల్లరి నరేష్. తెలుగు సినీ రంగంలో కామెడీ హీరో రాజేంద్రప్రసాద్ కి వారసుడిగా అల్లరి నరేష్ ని భావిస్తారు ఇండస్ట్రీ జనాలు, తెలుగు సినీ ప్రేక్షకులు.