అల్లరోడు గుడ్ బై చెబుతాడంట..

Update: 2016-11-26 17:03 GMT
ఎప్పుడో దసరా పండక్కే రావాల్సిన సినిమా ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. కానీ అప్పుడు పోటీ ఎక్కువుందని దీపావళికి వాయిదా వేశారు. తర్వాత ఆ పండక్కి కూడా సినిమాను రిలీజ్ చేయలేదు. నవంబరు 11న విడుదలకు సన్నాహాలన్నీ పూర్తి చేసుకుని రెడీగా ఉండగా.. మూడు రోజుల ముందు 500-100 నోట్ల రద్దుతో పెద్ద పంచ్ పడింది. ఈ అనూహ్య నిర్ణయంతో సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించాడు నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్. తర్వాతి వారమే సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ.. అప్పటికి కూడా ధైర్యం చాలలేదు. ఈ వారం.. తర్వాతి వారం కూడా థియేటర్లు బాగానే దొరికేట్లున్నా.. విడుదలకు సాహసించలేదు ప్రసాద్.

డిసెంబరు 9న ‘ధృవ’.. 16న ‘ఎస్-3’ లాంటి భారీ సినిమాలు రేసులో ఉన్నాయి. ఇక అల్లరోడికి ఉన్నది డిసెంబర్లో చివరి రెండు వారాలే. ఐతే యూనిట్ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబరు 30న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. డిసెంబరు 23న రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’.. నాని మూవీ ‘నేను లోకల్’ విడుదలయ్యే అవకాశముండటంతో డిసెంబరు 30న సినిమాను రిలీజ్ చేసి ఈ ఏడాదికి గుడ్ బై చెప్పాలని డిసైడయ్యారట. సినిమా మీద కాన్ఫిడెంటుగా ఉండటంతో ఆలస్యమైనా పర్వాలేదు మంచి టైమింగ్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అల్లరోడి కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం కావడం కూడా రిలీజ్ విషయంలో జాగ్రతత్ పడటానికి ఇంకో కారణం.
Tags:    

Similar News