నా పేరు సూర్య.. బర్త్ డే.. డైరక్టర్స్ డే

Update: 2018-04-30 04:21 GMT
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా మూవీ రిలీజ్ సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు ఆడియన్స్ మంచి స్పందనే వస్తోంది. మే 4వ తేదీన నా పేరు సూర్య థియేటర్లలోకి రానుంది. ముందు ప్లాన్ చేసినదానికన్నా వారం రోజుల తరవాత రిలీజ్ చేస్తున్నా 4న రావడం హ్యాపీగా ఉందంటున్నారు ఈ ఫిలిం మేకర్లు.

మే 4వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. నిన్నటి వరకు ఇండస్ట్రీకి పెద్దదిక్కు... శతాధిక చిత్రాల దర్శకుడు దాసరి నారాయణరావు బర్త్ డే అదే రోజు. దాసరి మృతి చెందిన తరవాత మే 4వ తేదీని డైరెక్టర్స్ డేగా (దర్శకుల దినోత్సవం) జరుపుకోవాలని ఇండస్ట్రీలోని డైరెక్టర్లంతా నిర్ణయించుకున్నారు. అలాంటి రోజున నా పేరు సూర్య సినిమా రిలీజవడం హ్యాపీగా ఉందని అల్లు అర్జున్ తండ్రి.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అన్నారు. ఈ మూవీ డైరెక్టర్ వక్కంతం వంశీ కూడా దాసరి తన గురువని చెప్పుకొచ్చాడు. ఆయన జయంతి సందర్భంగా జరిగే డైరెక్టర్స్ డే నాడు తాను డైరెక్ట్ చేసిన తొలి సినిమా రిలీజవడం పట్ల వక్కంతం వంశీ కూడా హ్యాపీగా ఫీలయ్యాడు.

అసలు నాపేరు సూర్య మే 28నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అదే టైంకు మహేష్ హీరోగా నటించిన భరత్ అనే నేను మూవీ కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. తరవాత అనవసరమైన పోటీ వల్ల ఉపయోగం లేదనుకుని భరత్ ఒక వారం ముందు రాగా.. సూర్య ఒక వారం వెనక్కు వచ్చాడు. భరత్ అనే నేను మూవీ రిలీజ్ రోజు మహేష్ తల్లి ఇందిర జన్మదినం. ఆరకంగా మహేష్ హ్యాపీ. ఇప్పుడు నా పేరు సూర్య టీం కూడా హ్యాపీ. సో.. కాంప్రమైజ్ కావడం ఇద్దరికీ లాభించిందన్న మాట.
Tags:    

Similar News