నంది అవార్డుల ప్రకటన వచ్చిన వెంటనే విమర్శలు వ్యక్తం చేసిన తొలి ఇండస్ట్రీ ప్రముఖుడు బన్నీ వాసు. మెగా ఫ్యామిలీకి.. ముఖ్యంగా అల్లు అరవింద్ కు అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు.. వారం కిందట నంది అవార్డులు ప్రకటించిన రోజే మెగా హీరోలందరూ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నటన నేర్చుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమే అయ్యాయి.
ఆ తర్వాత సైలెంటైపోయిన వాసు.. తాజాగా పోసాని కృష్ణమురళి నంది అవార్డుల విషయమై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నేపథ్యంలో మళ్లీ స్పందించాడు. మనం ఏపీలో పుట్టాం.. ఏపీలో పెరిగాం.. అమెరికాలో కాదు. ఏపీలోనే చదువుకున్నాం.. అమెరికాలో కాదు.. మన యాస ఏపీదే.. మనం ఏపీ వాళ్లమని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఐతే ఇలా అన్న బన్నీ వాసే.. కొన్ని గంటల తర్వాత స్వరం మార్చాడు. నంది అవార్డుల వ్యవహారాన్ని ఇంతటితో వదిలేస్తే అందరికీ మంచిదని.. ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదని బన్నీ వాసు వ్యాఖ్యానించడం విశేషం. నంది గొడవ మరీ శ్రుతి మించుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అల్లు అరవింద్ కు ఒత్తిళ్లు వచ్చాయని.. మీ క్యాంప్ వాళ్లను సైలెంటుగా ఉండమని చెప్పారని.. ఈ నేపథ్యంలోనే అల్లు ఆదేశాల మేరకు బన్నీ వాసు ఆ ట్వీట్ చేశారని అంటున్నారు. ఏదేమైనా కొన్ని గంటల్లో వాసు స్వరం మారిపోవడం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.