బన్నీ మళ్లీ నాన్నకు ప్రేమతో..

Update: 2016-02-28 04:19 GMT
అల్లు అర్జున్ కు కెరీర్ లో మంచి సక్సెస్ రేటే ఉంది. ఐతే బయటి నిర్మాతలకు బాగా డబ్బులు తెచ్చిపెట్టిన బన్నీ.. తన తండ్రికి మాత్రం మంచి ఫలితాల్నివ్వలేకపోయాడు. సొంత బేనర్లో చేసిన హ్యాపీ - బద్రీనాథ్ సినిమాలు సరైన ఫలితాల్నివ్వలేదు. ఐతే ఆ మచ్చల్ని ‘సరైనోడు’ సినిమాతో చెరిపోయాలని పట్టుదలతో ఉన్నాడు బన్నీ. ఈ సినిమా మీద ఫుల్ పాజిటివ్ బజ్ ఉండటం.. బోయపాటి శ్రీను లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఈ సినిమాను తీస్తుండటంతో తన తండ్రికి బన్నీ ఈసారి కాసుల పంట పండిస్తాడనే అంచనాలున్నాయి. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో కానీ.. తన తర్వాతి సినిమాను కూడా నాన్నకే చేసిపెట్టాలని డిసైడయ్యాడు బన్నీ.

‘సరైనోడు’ తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కబోతుండటం విశేషం. బన్నీ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తారట. తమిళ వెర్షన్ కు సూర్య కజిన్ జ్నానవేల్ రాజా నిర్మాత కాగా.. తెలుగు వరకు అల్లు అరవిందే నిర్మిస్తారట. కొంత కాలంగా స్థాయికి తగ్గ సినిమా తీయలేకపోతున్న లింగుస్వామి.. తనేంటో రుజువు చేసుకోవాలన్న పట్టుదలతో బన్నీ కోసం పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేశాడట. ఏప్రిల్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయాలన్నది ప్లాన్.
Tags:    

Similar News