పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అజ్ఞాతవాసి ఆడియో బయటకొచ్చేసింది. పవన్ కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ కు తగ్గట్టు ఆడియో రిలీజ్ కోసం ఈవెంట్ ను ఓ రేంజిలో నిర్వహించారు. మొదటి నుంచి చివరి వరకు అభిమానులను మెప్పించడమే లక్ష్యంగా ఈ ఈవెంట్ సాగింది. ఆ మధ్య కాలంలో సినిమా టీంలో ముఖ్యమైన వాళ్లందరి గొప్పతనం చెబుతూ స్టేజిపై నున్న స్క్రీన్ ఆడియో విజువల్స్ వచ్చేవి. రీసెంట్ గా ఈ ట్రెండ్ కాస్త మారినా అజ్ఞాతవాసి ఫంక్షన్ లో ఆ ట్రెండు కంటిన్యూ చేశారు.
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఆడియో విజువల్స్ ప్లే చేసేటప్పుడు ఆయనకున్న భాషా ప్రావీణ్యం దగ్గర నుంచి మొదలెట్టి ఆయన తీసిన మొదటి సినిమా నువ్వే.. నువ్వే.. తరవాత తీసిన హిట్ మూవీలు.. అందులోని డైలాగులు.. అవి ప్రేక్షకుల్లో ఎలాంటి ప్రభావం చూపించాయి అన్నవి నెరేట్ చేసుకుంటూ పోయారు. ఇంతవరకు బాగానే ఉన్నా త్రివిక్రమ్ సినీ జీవితాన్ని టర్న్ తిప్పిన సినిమాల గురించి ఇందులో కనీసం ప్రస్తావించలేదు. ముఖ్యంగా త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ స్టేటస్ వచ్చింది మహేష్ తో తీసిన అతడు సినిమాతోనే. ఈ సినిమాతో త్రివిక్రమ్ రేంజి మారిపోయింది. అలాగే అల్లు అర్జున్ తో తీసిన జులాయి కూడా త్రివిక్రమ్ డైరెక్షన్ టాలెంట్ కు అద్దం పట్టింది. కానీ ఆడియో విజువల్స్ లో ఈ రెండు సినిమాల మాటే వినిపించలేదు.
పనన్ కళ్యాణ్ గురించి ‘‘చెప్పను బ్రదర్’’ అంటూ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నప్పటి నుంచి పవర్ స్టార్ అభిమానులు అతడిపై కాస్త గుర్రుగానే ఉన్నారు. ఆ రీజన్ తో జులాయి సినిమా పేరెత్తపోయి ఉండటం కామనే. మహేష్ తో త్రివిక్రమ్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. పైగా వాళ్లిద్దరూ ప్రెండ్స్ కూడా. మరి అలాంటప్పుడు అతడి పేరెందుకు వినిపించలేదెందుకో?