నిన్న ఫుడ్ ఆర్డ‌ర్ .. ఈ రోజు పుష్ప‌తో సెల్ఫీ

Update: 2022-02-21 13:30 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైమ్ మామూలుగా లేదు. అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో చాలా రోజుల త‌రువాత ఇండ‌స్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్న బ‌న్నీ ఆ త‌రువాత చేసిన `పుష్ప‌`తో పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు.

సుకుమార్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన ఈ మూవీ గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఊహించ‌ని విధంగా ఈ మూవీ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది.

ద‌క్షిణాదితో పాటు ఈ మూవీ ఉత్త‌రాదిలోనూ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఉత్త‌రాదిలో ఊహ‌కంద‌ని రీతిలో `పుష్ప‌` వంద కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ట్రేడ్ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.

`అల వైకుంఠ‌పుర‌ములో` వంటి ఇండ‌స్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్న బ‌న్నీ ఆ వెంట‌నే `పుష్ప‌`తో పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని ద‌క్కించుకోవ‌డం నిజంగా విశేషం. ఈ మూవీ అందించిన స‌క్సెస్ ని గ‌త కొన్ని వారాలుగా ఎంజాయ్ చేస్తున్నారు బ‌న్నీ.

గ‌త కొన్ని వారాలుగా సెల‌బ్రేష‌న్ మోడ్ లోకి వెళ్లిన బ‌న్నీ `పుష్ప‌` స‌క్సెస్ ని ఫ్యామిలీతో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నారు. దుబాయ్ కి వెళ్లి అక్క‌డ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న బ‌న్నీ ఇప్ప‌టికీ అదే మోడ్ లో వున్నారు. ఈ సినిమాతో బిగ్ స్టార్ గా మారిపోయిన బన్నీ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైర‌ల్ గా మారింది.

మూడు రోజుల క్రితం త‌న వైఫ్ అల్లు స్నేహ కోసం ప్ర‌త్యేకంగా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ని ఆర్డ‌ర్ చేసి స‌ర్ ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోని అభిమానుల కోసం షేర్ చేశారు. చుట్టూ ర‌క ర‌కాల వంట కాల‌తో అలంక‌రించిన టేబుల్ ముందు అల్లు స్నేహ క‌నిపించిన ఫొటో నెట్టింట వైర‌ల్ గా మారింది.

తాజాగా అల్లు స్నేహ ఓ ఫొటోని షేర్ చేసింది. పుష్ప‌రాజ్ బ‌న్నీతో క‌లిసి తీసుకున్న సెల్ఫీని అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ పోటో నెట్టింట వైర‌ల్ గా మారి ఫ్యాన్స్ తో పాటు నెటిజ‌న్స్ ని ఆక‌ట్టుకుంటోంది.

ఈ ఫొటోపై అభిమానులు ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ లు చేస్తున్నారు. అన్నా వ‌దినా అంటూ మురిసిపోతున్నారు. అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల వివాహం 2011 మార్చి 6న జ‌రిగిన విష‌యం తెలిసిందే. వీరికి  వీరికి అల్లు అయాన్ , అల్లు అర్హ అనే ఇద్ద‌రు పిల్లలున్నారు.

ఇదిలా వుంటే అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప ది రైజ్‌` సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ అందించిన స‌క్సెస్ తో రెట్టించిన ఉత్సాహంలో వున్న చిత్ర బృందం పార్ట్ 2 ని మ‌రింత కొత్త‌గా తెర‌పైకి తీసుకురాబోతోంది. ఇందు కోసం సుకుమార్ స్క్రిప్ట్ లో సుకుమార్ భారీ మార్పులు చేస్తున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌మ్మ‌ర్ లో `పుష్ప ది రూల్‌` సెట్స్ పైకి వెళ్ల నుంద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News