ముంబై మీద బన్నీ లుక్ పడిందా?

Update: 2018-05-21 08:45 GMT
అల్లు అర్జున్ ఈ మధ్య మాట్లాడితే ముంబాయ్ అంటున్నాడు.. కొన్ని రోజుల  క్రితం ముంబై వెళ్లి అక్కడి నుంచి సీ లింక్ వీడియో తీసి పోస్ట్ చేసి.. 'ముంబై.. కలల నగరం' అంటూ క్యాప్షన్ పెట్టి మరీ పోస్ట్ చేశాడు. సరే.. ముంబై అన్నాక ఎవరికి నచ్చదు.. అందుకే ఇలా వీడియో షేర్ చేశాడులే అనుకుంటే.. మళ్లీ కొన్ని రోజుల వ్యవధిలోనే ముంబై ట్రివ్ వేశాడు స్టైలిష్ స్టార్.

ఈ సారి ముంబై వెళ్లినట్లు బన్నీ నేరుగా చెప్పలేదు కానీ.. అక్కడ ఓ రెస్టారెంట్ నుంచి డిన్నర్ చేసి బయటకు వస్తున్నపుడు.. ఎవరో ఫోటో తీసి నెట్ లో పెట్టేశారు. ఆ సమయంలో బన్నీ పక్కన ఎవరున్నారో తెలుసా.. తన వైఫ్ స్నేహారెడ్డిని తీసుకుని ముంబై వెళ్లి.. ఎంచక్కా ఓ మాంచి రెస్టారెంట్ లో డిన్నర్ చేసి.. ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు బన్నీ. కేవలం రెస్టారెంట్ కోసం ముంబై వెళ్లి ఉంటాడా అన్నదే చాలామందికి వస్తున్న డౌట్. పైగా తరచుగా ముంబైలో ఏం చేస్తున్నడబ్బా? అనే ప్రశ్న కూడా చాలామందికి తలెత్తుతోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ కి నార్త్ లో కూడా సూపర్బ్ ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. థియేటర్లలో కాకపోయినా.. శాటిలైట్ వ్యూయర్ షిప్ విషయంలో మాత్రం అక్కడి స్టార్లకు కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేయగల సత్తా బన్నీ సొంతం. డబ్బింగ్ సినిమాలు నార్త్ టీవీల్లోను.. ఆన్ లైన్ లోను  అదరగొట్టేస్తూ ఉంటాయి. తన ఇమేజ్ ను ఇలా శాటిలైట్ కే కాకుండా.. మరింతగా విస్తరించుకునే  ప్రయత్నాల్లో బన్నీ ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది కానీ.. ఇప్పటివరకూ ఆధారాలు మాత్రం కనిపించలేదంతే.
Tags:    

Similar News