మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ చాలా ఖుషీగా ఉన్నాడు. బన్నీకి ఇదే మొదటి ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా ఉంది. తనకు ఇంతటి విజయాన్ని అందించినందుకు త్రివిక్రమ్ కు బన్నీ కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఇదే సమయంలో ఆయనతో మళ్లీ ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నాడు.
ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జులాయి.. సన్నాఫ్ సత్యమూర్తి.. అల వైకుంఠపురంలో చిత్రాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడు కాకున్నా ఒకటి రెండు సంవత్సరాల తర్వాత అయినా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమా నిర్మించాలని అల్లు అరవింద్ కూడా భావిస్తున్నాడట. ఇప్పటికే ఆ విషయాన్ని త్రివిక్రమ్ వద్ద చెప్పడం.. అందుకు త్రివిక్రమ్ ఒప్పుకోవడం కూడా జరిగిందటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
అల్లు అరవింద్.. చినబాబు నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మళ్లీ సినిమా దాదాపుగా ఖాయం అని కాకుంటే కాస్త సమయం పడుతుందని మెగా కాంపౌండ్ కు చెందిన వారు కూడా అనఫిషియల్ గా చెబుతున్నారు. ప్రస్తుతానికి స్టోరీ లైన్ కూడా ఏదీ అనుకోలేదట. వీలైతే అల వైకుంఠపురంలో కే సీక్వెల్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం నిర్మాత అయిన అల్లు అరవింద్ వ్యక్తం చేశాడట. దానికి కథ ఓకే అయితే సీక్వెల్ లేదంటే మరో కొత్త కథతో బన్నీ.. త్రివిక్రమ్ ల మూవీ ఉండే అవకాశం ఉంది.
బన్నీ తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో చేయబోతుండగా.. త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ తర్వాత కూడా వీరిద్దరికి చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయి. కనుక మళ్లీ వీరి కాంబో సెట్ అవ్వడానికి కనీసం రెండేళ్లు అయినా పట్టవచ్చేమో..!