ఏ అన్న‌కైనా త‌మ్ముడు బేబి బోయే!

Update: 2019-05-30 14:01 GMT
అవును ..! ఏ అన్న‌కైనా త‌మ్ముడు బేబి బోయ్‌నే. ఎందుకంటే క‌ళ్ల ముందే పుట్టి.. క‌ళ్ల ముందే బుడి బుడి న‌డ‌క‌ల‌తో ఇంతింతై ఎదిగేస్తుంటే .. ఇంకా బుజ్జోడే క‌దా! అనిపిస్తుంది. నూనూగు మీసాలు వ‌చ్చి క‌ళ్ల ముందే కెరియ‌ర్ ప్రారంభించినా ఇంకా పాపం ప‌సోడే అనిపిస్తుంది. దానినే అన్న ద‌మ్ముల  ప్రేమానుబంధం అని అంటారు. తెలుగు సినిమాల్లో ఎప్ప‌టికీ స‌క్సెస్ ఫుల్ ఫార్ములా ఏది? అంటే బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య అనుబంధం నేప‌థ్యంలో సినిమా.

ఇదివ‌ర‌కూ అల్లు అర్జున్ న‌టించిన `రేసుగుర్రం` బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య అనుబంధానికి సంబంధించిన సినిమానే. అందులో ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్యం కోసం కొట్లాట‌కు దిగే బ్ర‌ద‌ర్స్ గా అల్లు అర్జున్ - శ్యామ్ క‌నిపించినా ఇంట‌ర్న‌ల్ గా అన్న‌పై త‌మ్ముడికి త‌మ్ముడిపై అన్న‌కు ఉండే ప్రేమ ఎలాంటిదో ఎంతో గొప్ప‌గా ఎలివేట్ చేసి తెలుగు ప్రేక్ష‌కుల నుంచి గొప్ప మార్కులు కొట్టేశాడు సురేంద‌ర్ రెడ్డి.

అదంతా స‌రే కానీ.. బ‌న్ని - అల్లు శిరీష్ ఇంట్లో ఉంటే అలా కొట్టుకుంటారా? ఒక‌రితో ఒక‌రు!! అంటే అబ్బే అంత సీన్ లేద‌ని అర్థ‌మ‌వుతోంది. బ‌న్ని త‌న‌ని ఎంత ముద్దుగా పిలుస్తాడంటే.. మై బేబి బ్ర‌ద‌ర్ శిరి!! అంటూ ముద్దుగా పిలిచేస్తాడంతే!! నేడు అల్లు శిరీష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఒక కేక్ ఆర్డ‌ర్ ఇచ్చి బ‌న్ని- స్నేహారెడ్డి జంట కిడ్స్ అల్లు అయాన్ - అల్లు అర్హ తో కేక్ క‌ట్ చేయించి ఏకంగా శిరీష్ కి తినిపించారు. ఇంత‌కంటే ఏ బ‌ర్త్ డే బోయ్ కి అయినా గొప్ప సెల‌బ్రేషన్ ఇంకేం కావాలి. ఏ అన్న‌కైనా త‌మ్ముడు బేబి బోయ్ తో స‌మానం. అందుకే బ‌న్ని ఎంతో ఎమోష‌న‌ల్ గాసామాజిక మాధ్య‌మాల్లో ఫోటోకి ఓ వ్యాఖ్య‌ను జోడించాడు. ``నా జీవితంలో తొలి బేబికి హ్యాపి బ‌ర్త్ డే. నా ఆరంభం నుంచి నా క‌ళ్ల ముందే ఎదిగిన బేబి. నా జ్ఞాప‌కాల్ని.. ర‌హ‌స్యాల్ని నేను మ్యాగ్జిమ‌మ్ పెంచుకున్న‌ది త‌న‌తోనే. మై బేబి బ్ర‌ద‌ర్ శిరి. హ్యాపి బ‌ర్త్ డే`` అంటూ వ్యాఖ్య‌ను జోడించాడు. ఇంత‌కీ శిరితో ఏం ర‌హస్యాలు చెప్పావ్ బ‌న్నీ?


Tags:    

Similar News