ఫోటో స్టొరీ: స్నేహ అమ్మమ్మగారింట్లో బన్నీ

Update: 2018-10-18 18:24 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా సంగతి ఇంకా తేలలేదు గానీ అంతలోపు తనకున్న ఫ్రీ టైమ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యామిలీకే ఎక్కువ సమయం కేటాయిస్తూ బన్నీ- ది ఫ్యామిలీమ్యాన్ అనిపించుకుంటున్నాడు. రీసెంట్ గా బన్నీ దసరా సందర్భంగా తన వైఫ్ స్నేహారెడ్డి అమ్మమ్మగారింటికి కుటుంబ సమేతంగా వెళ్ళాడట.

ఆ ఊరు చింతపల్లి.. పెద్దపుర మండలం..  నల్లగొండ జిల్లా.  ఇక ఫ్యామిలీతో కలిసి వెళ్లి అక్కడకు వెళ్ళిన విషయం స్థానికులకు తెలియడంతో ఇక చాలామంది అభిమానులు.. పిల్లలు బన్నీని చూసేందుకు వచ్చారు. దీంతో స్నేహ అమ్మమ్మ గారింటి దగ్గర సందడి నెలకొందట.  పైన ఉన్నఫోటో అక్కడ తీసినదే.   వైట్ లాల్చీ లాంటి డ్రెస్ తో తన స్టైలిష్ స్టార్ ట్యాగ్ కు ఫుల్ గా జస్టిస్ చేస్తున్నాడు కదా?

అల్లు అర్జున్ ప్రతి ఏడాది దసరా సమయంలో స్నేహ - పిల్లలను తీసుకుని అత్తగారింటికి వెళ్తాడు. ఈసారి అత్తగారిల్లే కాకుండా.. స్నేహ అమ్మమ్మ గారిల్లు కూడా కవర్ చేశాడన్నమాట.  దసరా టైమ్ మనకే కాదు స్టైలిష్ స్టార్ కి కూడా ఫుల్ గా ఫ్యామిలీ టైమ్.
Tags:    

Similar News