డీజే లెక్కలు హద్దులు దాటుతున్నాయా?

Update: 2017-04-08 06:10 GMT
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా వక్కంతం వంశీతో కొత్త సినిమా అనౌన్స్ మెంట్.. డీజే కొత్త పోస్టర్ల హంగామా ఇప్పటికే పీక్ స్టేజ్ లో ఉంది. మరోవైపు.. డీజే మూవీని ఫినిష్ చేసేయడంలో బిజీగా ఉన్నాడు స్టైలిష్ స్టార్. ఈ దువ్వాడ జగన్నాధంకు ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అవుతోందనే టాక్ హల్ చల్ చేస్తోంది.

బడ్జెట్ పరిమితి దాటడం కొత్తేమీ కాదు కానీ.. దిల్ రాజు అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రొడ్యూసర్. ఆయన తీస్తున్న మూవీ ఇలా హద్దు దాటడం ఆశ్చర్యకరమే. అయితే.. బన్నీ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని.. రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేయడం కంటే.. వీలైనంత వరకూ సెట్స్ వేసి మరీ సినిమా తీస్తున్నారట. ఈ సెట్టింగుల కారణంగానే ఖర్చు ఎక్కువవుతోందని తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని 60కోట్లతో పూర్తి చేయాలని అనుకున్నారట కానీ.. ఇప్పటికే 70 వరకూ లెక్క వచ్చేసిందని తెలుస్తోంది. అయితే.. చాలా కాలం తర్వాత దిల్ రాజు భారీ సినిమా తీస్తున్నాడు. పైగా మెగా హీరోతో మూవీ అంటే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్.

వీటన్నిటికీ మించి డీజేకు 100 కోట్ల బిజినెస్ సత్తా ఉంది. పైగా టేబుల్ ప్రాఫిట్ లెక్కలతో మొదలుపెట్టిన సినిమా కావడంతో.. బడ్జెట్ పరిధి పెరుగుతున్నా దిల్ రాజు ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News