సరైనోడి ఎంట్రీ అదరిపోయిందంతే

Update: 2018-04-30 04:25 GMT
తన స్టయిల్ తోనే తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే హీరో అల్లు అర్జున్. అందుకే సినిమాల్లో అల్లు అర్జున్ చాలా సినిమాల్లో ఇంట్రడక్షన్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయి. హీరోగా బన్నీ సిల్వర్ స్క్ర్రీన్ పై కనిపించే సరికి విజిల్స్ మార్మోగిపోతాయి.

కానీ మొదటిసారి అల్లు అర్జున్ రియల్ ఎంట్రీ రీల్ ఎంట్రీ కన్నా అదిరిపోయింది. బన్నీ లేటెస్ట్ మూవీ నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా.. ఢిఫరెంట్ గా ఉంటుందని ముందే ప్రచారం చేశారు. దాంతో ఫ్యాన్సంతా అదెలా ఉంటుందో చూద్దామని ముందే వచ్చేశారు. స్టేజ్ పై ముందుగా డ్యాన్సర్ల పెర్ఫార్మెన్స్ అయ్యాక మొత్తం లైట్లు ఆర్పేశారు. కాసేపు కళ్లు మిరుమిళ్లు గొలిపేలా లేజర్ లైట్ షో కంటిన్యూ చేశారు. తరవాత ఎత్తయిన క్రేన్ పై ఇండియన్ ఫ్లాగ్ ఎదురుగా స్టయిలిష్ లుక్ తో బన్నీ కనిపించాడు.

వెనుక నాపేరు సూర్య పాటలోని సైనిక సాంగ్ ప్లే అవుతుండగా నెమ్మదిగా క్రేన్ పై నుంచి కిందకు దిగాడు. బన్నీ కిందకు దిగిన వెంటనే ఆర్టిస్టులంతా గ్రాండ్ వెల్ కం చెప్పారు. మొత్తానికి ఈ హంగామా అంతా కమర్షియల్ సినిమా ఇంట్రడక్షన్ కు ఏ మాత్రం తీసిపోలేదు. దీనికోసం ఫిలిం మేకర్లు రూ. 20 లక్షలు ఖర్చు పెట్టారని టాక్. ఈ లెక్కన సినిమాలో ఇంట్రడక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతోందో?

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News