రుద్రమదేవి బంపర్ హిట్ కొట్టింది. థియేటర్లలో కలెక్షన్లు బావున్నాయి. ఎ,బి,సి కేంద్రాల్లో ఈ సినిమా బాగానే ఆడుతోంది. అయితే ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం వెనక రెండు బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి అనుష్క రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అద్భుతంగా అభినయించడం, రెండోది గోనగన్నారెడ్డిగా బన్ని చేసిన యాక్టింగ్ ఈ సినిమాని కాపాడాయి.
బన్ని తెలంగాణ యాక్సెంట్ లో అదరగొట్టేశాడు. అతడి రోల్ ఎంటర్ అయినప్పట్నుంచి ఎంటర్ టైన్ మెంట్ బాగా పీక్స్ లోకి వెళ్లింది. అది సినిమాకి శ్రీరామరక్ష అయ్యింది. అయితే ఈ సినిమాలో బన్ని క్యారెక్టర్ లో లాజిక్ వెతికితే ఓ లోటు కనిపిస్తుంది. ఆరోజుల్లో బందిపోటు పొడవాటి శిరోజాలతో కనిపించేవారు. గుర్రం ఎక్కి మూతికి నల్లగుడ్డ కట్టుకుని ముఖం ఎవరిదో ఆనవాలు తెలీకుండా కనిపించేవారు. అయితే బన్ని అందుకు పూర్తి భిన్నంగా పొట్టి హెయిర్ తో మోడ్రన్ స్టయిల్లో కనిపించాడు. ఇదే ప్రశ్న సినిమా రిలీజ్ ముందు బన్నిని అడిగితే ఏం చెప్పాడో తెలుసా?
ఓ రెండ్రోజుల పాటు పొడవాటి జుట్టు, నల్లని గుడ్డను చుట్టుకుని షూటింగ్ చేశాం. కానీ అది అసౌకర్యంగా అనిపించి దర్శకుడితో మాట్లాడి దానిని తొలగించాం. అయితే కథలో దానికి ఓ లాజిక్ ని యాడ్ చేశాం. ఆరోజుల్లో పొడవాటి హెయిర్ లేకపోతే పన్ను విధించేవారు. కానీ బంధిపోటు గన్నారెడ్డి అన్నిటికీ వ్యతిరేకం. అందుకే లాంగ్ హెయిర్ ని వ్యతిరేకించాడు అనే లాజిక్ చూపించాం.. అని చెప్పాడు. రెండు రోజుల షూట్ వృథా అయ్యింది. దాదాపు 20లక్షలు ఖర్చు వృథానే. అయితేనేం గోనగన్నారెడ్డి క్యారెక్టర్ కి థియేటర్లలో చక్కని రెస్పాన్స్ వస్తోంది. ఇదంతా బన్ని క్రెడిట్.