టోపీ స్టెప్పులతో బన్నీ పిచ్చెక్కించాడు!!

Update: 2018-05-02 13:15 GMT
మన హిరోల దగ్గర టాలెంట్ ఏ మాత్రం లేదని అప్పుడపుడు కొంత మంది ఇష్టం వచ్చినట్లు వాగేస్తుంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని ఆడి పోసుకోవడంలో ముందుంటారు. కానీ ఎంత మెగాస్టార్ చిరంజీవి గారి సపోర్ట్ తో వచ్చినా ఆడియెన్స్ లైక్ చేసేది వారి టాలెంట్ ని చూసే. ఒక కథానాయకుడికి ఉండాల్సిన ప్రతి లక్షణం బన్నీకి ఉందని  చెప్పవచ్చు. ఒక సినిమా వెనకాల ఒక హీరో ఎంత కష్టపడతాడో చాలా మందికి తెలియదు.

కానీ బన్నీ కష్టపడే గుణాన్ని ఎవరైనా చుస్తే నిజంగా హీరో అవ్వాలంటే కష్టమే అనే మాట రాకుండా ఉండదు. తెరపై ఏం చూసినా ఈజీగానే అనిపిస్తుంది కానీ వెనకాల దాని కోసం కష్టపడే విధానం వర్ణనాతీతం. అల్లు అర్జున్ తన ప్రతి సినిమాలో డ్యాన్స్ విషయంలో ఎదో ఒక కొత్త ధనాన్ని చూపించడం అలవాటే. అయితే నా పేరు సూర్య సినిమాలో కూడా ఇప్పటి వరకు చూడని క్యాప్ ట్రిక్స్ స్టెప్స్ తో అలరించడానికి సిద్దమయ్యాడు.   

లవర్ ఆల్సొ ఫైటర్ ఆల్సో పాట కోసం చేసిన ఆ మూమెంట్స్ కి సంబందించిన బి హైండ్ సీన్స్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అందులో బన్నీ పిచ్చెక్కించాడనే చెప్పాలి. దాదాపు మూడు నెలలు కష్టపడి నేర్చుకొని బన్నీ ఆట్రిక్స్ చేశాడట. పని రాక్షసుడు అనే పదానికి నిజమైన అర్ధం స్టైలిష్ స్టార్. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. సినిమా ఈవెంట్స్ లో హీరోను ప్రతి ఒక్కరు పొగుడుతారు. అందులో ఎంతవరకు నిజాలో చెప్పలేము గాని.. బన్నీ గురించి నా పేరు సూర్య టీమ్ చెప్పినవన్నీ నిజాలని ఈ వీడియో ద్వారా ఋజువయ్యింది.   

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News