అల్లు అర్జున్ పెద్ద మనసు చాటుకున్నాడు

Update: 2018-05-06 06:33 GMT
సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక హీరోలకు అభిమానులకు మధ్య బంధం మరింత బలపడింది. ట్విట్టర్.. ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా హీరోలు అభిమానులతో కనెక్టయి ఉంటున్నారు. హీరోల పీఆర్ టీమ్స్ అభిమాన సంఘాల్ని సోషల్ మీడియాలో బాగా మేనేజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అభిమానులెవరికైనా పెద్ద కష్టం వస్తే హీరోలు స్పందిస్తున్నారు. తీవ్ర అనారోగ్యం పాలై.. తమ అభిమాన కథానాయకుల్ని కలవాలని ఆశించే ఫ్యాన్స్ ను ఆదరించే ప్రయత్నం జరుగుతోంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్.. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్న తమ అభిమానుల్ని కలుసుకుని వారికి ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలో చేరాడు.

అనకాపల్లిలో బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ మంచం పట్టిన దేవ్ సాయి గణేష్ అనే కుర్రాడి గురించి బన్నీకి ఇటీవలే తెలిసింది. కొత్త సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ వీలు చూసుకుని శనివారం హైదరాబాద్ నుంచి అనకాపల్లికి వెళ్లాడు. అక్కడ అభిమానులతో కలిసి దేవ్ ఇంటికి వెళ్లాడు. అతడిని పరామర్శించాడు. ప్రేమగా మాట్లాడి ఫొటోలు దిగాడు. అంతే కాక దేవ్ చికిత్స కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేశాడు. దేవ్ త్వరగా కోలుకోవాలని అభిలషించాడు. దీంతో దేవ్ ఆనందానికి అవధుల్లేవు. బన్నీ పీఆర్వోలకు దేవ్ అన్నయ్య అతడి గురించి సోషల్ మీడియా ద్వారా అతడి గురించి సమాచారం ఇచ్చాడు. బన్నీని కలవాలన్నది అతడి చివరి కోరిక అని విన్నవించాడు. బన్నీ వచ్చి వెళ్లాక అతడికి కృతజ్ఞతలు చెబుతూ దేవ్ అన్నయ్య మరో మెసేజ్ పెట్టాడు.
Tags:    

Similar News