ఈ సమ్మర్ లో సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో బన్నీ బాక్సాఫీస్ వద్ద వీరంగం ఆడేశాడు. యావరేజ్ టాక్ తో స్టార్ట్ అయిన సరైనోడు ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకుని బన్నీ కేరీర్ లోనే ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ గా రికార్డుల కెక్కింది. సరైనోడు తర్వాత బన్నీ మార్కెట్ బాగా పెరిగిపోయింది. వరుసగా క్లాస్ సినిమాలు చేస్తూ వచ్చిన బన్నీ సరైనోడు మాస్ హీరోగా కూడా ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే సరైనోడు తర్వాత బన్నీ ఏ డైరెక్టర్ తో పని చేస్తాడనేదానిపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ రాలేదు.
సరైనోడు తర్వాత ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తాడిన వార్తలు వచ్చాయి. అయితే 24 లాంటి డిఫరెంట్ కాన్సెఫ్ట్ తో హిట్ కొట్టిన విక్రమ్ కుమార్ పేరు కూడా లైన్లోకి వచ్చింది. విక్రమ్ కుమార్-నితిన్ తో ఫిక్స్ అవ్వడంతో బన్నీ లింగుస్వామితో చేయడం కన్ ఫార్మ్ అన్న టాక్ వచ్చింది. ఆల్ మోస్ట్ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అన్న నిర్ణయానికి టాలీవుడ్ సినీజనాలు వచ్చేశారు. ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నట్లు, సంగీత దర్శకుడిగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ను ఎంపిక చేశారనే గాసిప్స్ చక్కర్లు కొట్టాయి.
అయితే ఫిల్మ్ నగర్ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం బన్నీ లింగుస్వామికి హ్యాండ్ ఇచ్చి ... మరో డైరెక్టర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ లాంటి హిట్ సినిమా తర్వాత రామయ్యా వస్తావయ్యాతో అడ్రస్ లేకుండా పోయాడు డైరెక్టర్ హరీష్ శంకర్. రీసెంట్ గా హరీష్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. సుబ్రహ్మణ్యం తర్వాత హరీష్ బన్నీతో సినిమా చేసేందుకు నాలుగైదు కథలు వినిపించగా ఎట్టకేలకు హరీష్ చెప్పిన ఓ కథకు బన్నీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమా గురించి మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయని టాక్.