రూటు మార్చిన బన్నీ

Update: 2018-04-10 08:59 GMT
టాలీవుడ్ లో కమర్షియల్ హీరోగా టాప్ పొజిషన్ ఉన్నాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. తెలుగుతోపాటు మళయాళంలోనూ బన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్ లో సౌత్ డబ్బింగ్ సినిమాల్లోనూ హయ్యస్ట్ వ్యూయర్ షిప్ అతడికే ఉంది. ఇప్పటివరకు సరైనోడు.. రేసుగుర్రం.. దువ్వాడ జగన్నాథమ్ వంటి కమర్షియల్ ఎంటర్ టెయినర్లు చేసుకుంటూ వస్తున్న బన్నీ కాస్త రూటు మార్చినట్లే కనిపిస్తోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇది దేశభక్తి ప్రధాన చిత్రమని మొదటి నుంచే స్పష్టంగా చెబుతూ వస్తున్నారు. ఇందులో బన్నీ బాధ్యతగల ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు. కాబట్టి ఇందులో అల్లు అర్జున్ స్టయిల్ వెటకారం.. ఊర మాస్ డైలాగ్ డెలివరీ లాంటివి ఎక్స్ పెక్ట్ చేయలేం. దీని తరవాత బన్నీ క్రిష్ డైరెక్షన్ లో అహం బ్రహ్మాస్మి అనే సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. ఇది కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం కాదు. క్రిష్ స్టయిల్ లో స్టోరీ ఓరియంటెడ్ సినిమా. కంగన రనౌత్ హీరోయిన్ గా ప్రస్తుతం క్రిష్ తీస్తున్న బాలీవుడ్ మూవీ మణికర్ణిక తరవాత ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశముంది.

క్రిష్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఇంతకుముందు వేదం సినిమా చేశాడు. హీరోగా టాప్ పొజిషన్ లో ఉంటూనే ఆ సినిమాలో చిన్న రోల్ చేశాడు. ఇప్పుడు ఏకంగా సోలో హీరోగా చేస్తుండటం ఓ రకంగా ప్రయోగమే. రామ్ చరణ్ తేజ్ చేసిన రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో వైవిధ్యమైన సినిమాలపై నమ్మకం పెంచింది. ఈ నమ్మకంతోనే బన్నీ కూడా క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ను మరోసారి వైవిధ్యమైన పాత్రలో చూడటానికి రెడీ అయిపోవచ్చన్న మాట.
Tags:    

Similar News