పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ స్టార్ట్ చేసిన నాటి నుంచి మెగా హీరోల నుంచి అభినందన సందేశాలు తక్కువే. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్టార్ట్ చేసిన రాజకీయ యాత్రపై మెగా హీరోలు పలువురు ట్వీట్లు చేసి.. అభినందనలతో పాటు ఆల్ ద బెస్ట్ అని చెప్పారు.
బాబాయ్‌కి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఇద్దరు అబ్బాయిలు (రాంచరణ్.. వరుణ్ తేజ్ )తో పాటు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ట్వీట్ చేశారు.మెగా క్యాంప్ లోని కుర్ర హీరోలంతా పవన్ కు ఆల్ ద బెస్ట్ చెబితే.. అదే క్యాంప్ కు చెందిన అల్లు అర్జున్ మాత్రం ట్వీట్ చేయకపోవటం ఆసక్తికరంగా మారింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బన్నీ.. పవన్ పర్యటన మీద మాత్రం ఎలాంటి వ్యాఖ్య చేయకపోవటంపై మెగా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ మధ్యన సరైనోడు చిత్ర ఫంక్షన్లో పవన్ గురించి చెప్పాలంటూ మెగా అభిమానులు అడుగుతున్న వేళ.. నేను చెప్పను బ్రదర్ అంటూ ఆవేశంతో స్టేట్ మెంట్ ఇచ్చిన బన్నీపై పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉండటం తెలిసిందే.
తాజాగా మిగిలిన హీరోలంతా ఆల్ ద బెస్ట్ అని చెబితే.. బన్నీ మాత్రం చెప్పకుండా మౌనంగా ఉండటం విశేషంగా మారింది. అందరి దారి తన దారి కాదన్నట్లుగా బన్నీ తీరు ఎప్పటిలానే ఇప్పుడు కొత్త చర్చకు తెర తీయటమే కాదు.. మెగా అభిమానుల్లో చీలకకు కారణం కానుందంటున్నారు. ఇంతకీ.. పవన్ కు బన్నీ ఎందుకు విషెస్ చెప్పాలనిపించలేదన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది.