బ్రాండ్ బిల్డింగ్ లో బన్నీ సూపర్

Update: 2017-05-28 05:49 GMT
అల్లు అర్జున్.. టాలీవుడ్ లో ఇప్పుడీ పేరు ఓ బ్రాండ్ అనడంలో సందేహం అక్కర్లేదు. తన స్టైల్ లో తను సినిమాలు చేసుకుంటూ.. మినిమం గ్యారంటీ నుంచి మాగ్జిమమ్ హిట్స్ కొట్టే వరకూ వచ్చేశాడు. గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ నటించిన ప్రతీ మూవీ కనీసం 50 కోట్ల షేర్ వసూళ్లను సాధించేస్తోందంటే.. బన్నీ తన కెరీర్ మలుచుకున్న తీరు అర్ధమవుతుంది.

ఒక్కో సినిమాకు రేంజ్ పెంచుకుంటూ వెళుతున్న అల్లు అర్జున్.. మరోవైపు మలయాళ మార్కెట్ లో కూడా సత్తా చాటేసి మల్లు అర్జున్ అనిపించేసుకున్నాడు. అక్కడి స్ట్రెయిట్ సినిమాలతో సమానంగా బన్నీ డబ్బింగ్ మూవీస్ ఆడే రేంజ్ కు చేరుకున్నాడు. ఇక బ్రాండ్ అండార్స్ మెంట్స్ విషయంలో కూడా బన్నీ గేర్ మార్చేశాడు. మొదట్లో ఓ టూత్ పేస్ట్.. కూల్ డ్రింక్ యాడ్స్ చేసిన బన్నీ.. ఆ తర్వాత నెమ్మదించాడు. కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ జెట్ స్పీడ్ లో బ్రాండ్ అండార్స్ మెంట్స్ దక్కించుకుంటూ.. షాక్ కొట్టించేస్తున్నాడు.

ఇప్పటికే ఓ బస్ బుకింగ్ యాప్.. మోటార్ సైకిల్స్ తోపాటు మరికొన్ని యాడ్స్ బన్నీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ కూడా అల్లు అర్జున్ చేతికి వచ్చేసింది. పైగా సౌత్ లో ఈ బ్రాండ్ ప్రమోషన్ ను షారూక్ ఖాన్ నుంచి బన్నీకి బదలాయించేసింది కంపెనీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News