ఫోటో స్టొరీ: అల్లు బుడుగులతో స్నేహ!

Update: 2018-07-25 17:38 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదని.. 'నా పేరు సూర్య నా ఇలు ఇండియా' సినిమా ఫెయిల్యూర్ తో ఫుల్లు కన్ఫ్యూషన్ లో ఉన్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.  అంటే.. అదే పనిగా అవి ఆలోచిస్తూ ఉంటూ మిగతా పనులన్నీ మానేస్తాడా ఏంటి? అలా ఏం లేదు. బన్నీ తనకొచ్చిన గ్యాప్ ను ఫుల్లుగా ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నాడు.

అల్లువారింట్లో నిన్న దుర్గా పూజ జరిగిందట.  ఈ సందర్భంగా అల్లు అర్జున్ వైఫ్ స్నేహ - పిల్లలు అయాన్.. అర్హా లు ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ తన వైఫ్ ఫోటో ఒకటి ఫేస్ బుక్  లో పోస్ట్ చేసి 'నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. ఇలాంటి ప్రెట్టి వుమన్ ను పెళ్ళి  చేసుకున్నానని' అనే క్యాప్షన్ పెట్టాడు.  మరో వైపు స్నేహ.. అయాన్.. అర్హ లు కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  ఈ ఫోటో లో అమ్మ స్నేహకు అటువైపు బుల్లి అర్హ.. ఇటువైపు బుజ్జి అయాన్ నిలబడి మంచి స్మైల్ ఇస్తూ సూపర్ పోజ్ ఇచ్చారు. 

ఇలాంటి ఫోటో బయటకు వస్తే ఇక ఫ్యాన్స్ కు పండగే కదా... క్షణాల్లో వైరల్ అయిపోయింది.  ఈ ఫోటో చూస్తుంటే బన్నీ తన కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్ళేదాకా తన బ్యూటిఫుల్ ఫ్యామిలీని వదిలిపెట్టి బయట అడుగుపెట్టేలా లేడనిపిస్తోంది!



Tags:    

Similar News