ఈ ముగ్గురినే ఫాలో అవుతావా బన్నీ?

Update: 2015-04-10 07:08 GMT
ట్విట్టర్‌లో ఎవరు ఎవరిని ఎలా అయినా ఫాలో అవ్వొచ్చు. నచ్చకపోయినా, కుదరకపోయినా వదిలేయనూ వచ్చు. ఇప్పటికే ట్విట్టర్‌లో ఖాతాలు తెరిచిన మన స్టార్‌ హీరోలు ఒక్కొక్కరూ ఒక్కో స్టయిల్‌లో వెళుతున్నారు. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌ ఖాతా తెరిచాడే కానీ అసలు ఎవరినీ అనుసరించడు. అతడు జీరో. అదే మహేష్‌ అయితే ఒకే ఒక్కరిని అనుసరిస్తాడు. బావ గల్లా జయదేవ్‌ను తప్ప ఇంకెవరినీ అతడు టచ్‌ కూడా చేయడు. మొన్ననే పుట్టినరోజు సందర్భంగా బన్ని ట్విట్టర్‌లోకొచ్చాడు. ఆరంభం 16 మందిని ఫాలో అయ్యాడు. అందులో హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు అందులోంచి కొందరిని కట్‌ చేశాడు. ప్రస్తుతం ఓ ముగ్గురిని మాత్రమే ట్విట్టర్‌లో అనుసరిస్తున్నాడు. పవన్‌కల్యాణ్‌, శిరీష్‌, రానా .. ఈ ముగ్గురితో తప్ప ఇంకెవరితోనూ ట్విట్టర్‌లో ముచ్చటించడట. ట్విట్టర్‌లో బటన్స్‌ గురించి ఇంకా అవగాహన రాలేదు.. అని  చెప్పాడు. ఎదుటివారిని పట్టించుకునేంత తీరిక, సమయం ఉండదు అనుకోవాలా? లేక ఇంకేదైనా కారణమా? ఏదైనా కొందరికి ఆన్‌లైన్‌ చాటింగులపై పెద్దగా ఆసక్తి ఉండదు. మరికొందరికి అయితే టైమే సరిపోదు. ఇంకొందరికి పట్టించుకునే ఓపికే ఉండదు. అందుకే ఇలా జరుగుతోందని అనుకోవచ్చేమో!

Tags:    

Similar News