అన్న బార్ లో తమ్ముడి వంట

Update: 2017-11-27 07:07 GMT
మెగా ఫ్యామిలీలో మిగతా వారితో పోలిస్తే అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. సినిమాకు సంబంధించిన విశేషాలే కాదు... పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటాడు. తాజాగా ఓ వంట చేస్తూ శిరీష్ పోస్ట్ చేసిన ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ వంట కంటే అది చేసిన ప్లేసే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోంది.

సినిమా నటుల్లో ఈమధ్ బిజినెస్ లపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఈ బ్యాచ్ లో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తాజాగా తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓ పోష్ బార్ పెట్టాడు. దాని పేరు బి-డబ్స్. రీసెంట్ గా శిరీష్ ఈ బారుకొచ్చాడు. వచ్చాక తీరిగ్గా కిచెన్ రూంలోకి ఎంటరయ్యి వంటలో తనకున్న ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. చికెన్ వింగ్స్ తయారు చేసి ఇదిగో ఇలా సిద్ధమైందంటూ ఆహార ప్రియుల నోరూరేలా ఓ ఫొటో తీశాడు. దీనిని ట్విట్టర్ లో అభిమానులందరికీ షేర్ చేశాడు. గ్రేట్ ఫుడ్ అంటూ తన వంటకు కితాబు ఇచ్చేసుకుని ఆహార ప్రియులైతే ఈ బార్ ను విజిట్ చేయమంటూ ఓ సలహా కూడా ఇచ్చాడు.

ప్రస్తుతం అల్లు శిరీష్ ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఒక్క క్షణం సినిమా చేస్తున్నాడు.  జెంటిల్ మెన్ - ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నార్త్ బ్యూటీ సురభి ఇందులో శిరీష్ కు జంటగా నటిస్తోంది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News