యంగ్ హీరో అల్లు శిరీష్ సోషల్ మీడియాలలో ఇతరుల కంటే స్పీడ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ సంగతులు..సినిమా విశేషాల్ని ఎప్పటికప్పుడు మెగాభిమానులకు చేరవేస్తుంటాడు.
అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటాడు. అయితే తాజాగా శిరీష్ సోషల్ మీడియాకి దూరంగా ఉంటానంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది నవంబర్ 11-11-2021వ తేదీ చాలా స్పెషల్. జీవితంలో మర్చిపోలేని తేదీ. ఎందుకనేది త్వరలో చెబుతా. ఈ గ్యాప్ వృత్తిపరంగానే. అప్పటివరకూ కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాకి దూరంగా ఉంటానని శిరీష్ వెల్లడించాడు.
అయితే ఆ సంచలన రహస్యాన్ని ఎంతో సేపు దాచలేకపోయాడు. ఇలాంటి విషయాలు సోషల్ మీడియాలో నిత్యం టచ్ లో ఉండే వారి దృష్టికెళ్తే..అసలు సంగతి ఏమిటా అంటూ ఊరికే వదిలిపెట్టరుగా. సరిగ్గా అదే జరిగింది. శిరీష్ ఎందుకలా దూరంగా ఉంటున్నట్టు? అసలు కారణం ఏంటి అన్నా? లవ్ సెట్ అయిందా? లేక పెళ్లి కుదిరిందా? దేనికి బ్రేక్ అంటూ ఒక అభిమాని అడిగేయడం.. దానికి శిరీష్ వెంటనే సమాధానం ఇచ్చేయడం ఆసక్తిని కలిగించింది.
ఇది కేవలం వృత్తి పరంగా అని ముందే చెప్పాను కదా! అంటూ శిరీష్ అభిమానికి రిప్లై ఇచ్చాడు. మరొక నెటిజన్ హాలీవుడ్ కి వెళ్తున్నావా? అంటూ ప్రశ్నించగా.. లేదు బ్రో.. అలాంటి ఆశయాలు లేవు. నా కొత్త సినిమా ఫిక్స్ అయింది. కథ నచ్చిన ఆనందంలో...కెరీర్ లో బెస్ట్ స్క్రిప్ట్ అవుతుందని ఈ గ్యాప్! అంటూ అసలు విషయం లీక్ చేసాడు శిరీష్.
అంటే శిరీష్ ఫోకస్ అంతా ఆ సినిమాపైనే పెట్టాడని తెలుస్తోంది. సినిమా పూర్తయ్యే వరకూ సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ సినిమా పూర్తిచేసిన తర్వాత మళ్లీ ఖాతాలోకి లాగిన్ అవుతారన్నమాట. ప్రస్తుతం శిరీష్ `ప్రేమ కాదంట` అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం స్పెషల్ లుక్ ని సిద్ధం చేసాడు. సిక్స్ ప్యాక్ లుక్ లో ఆకట్టుకోబోతున్నాడు. ఇందులో శిరీష్ కి జోడీగా అందాల కథానాయిక అను ఇమ్యాన్యుయేల్ నటిస్తోంది. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ నిర్మిస్తున్నారు.