సినిమా ఇండస్ట్రీ ఎన్నడూ లేనటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. లాక్ డౌన్ తో థియేటర్లు మూతపడడంతో అప్పటికే కంప్లీటైన సినిమాలు ఎప్పుడు టాకీసులు ఓపెన్ అవుతారా? అని ఎదురు చూశాయి. ఇప్పుడు పూర్తిగా తెరుచుకోవడంతో సినిమాలన్నీ స్టోర్ రూం నుంచి బయట పడడానికి ఆరాటపడుతున్నాయి.
థియేటర్లు ఓపెన్ కావడం.. అది కూడా సంక్రాంతి సీజన్లో కావడంతో పొంగల్ బరిలో నిలిచేందుకు ఎవరికి వారు ప్రయత్నించారు. చివరకు తలా ఒక రోజుగా పంచుకున్నారు. అలా సంక్రాంతి బరిలో మొత్తం నాలుగు సినిమాలు నిలిచాయి.
ఇందులో ఇప్పటికే రవితేజ ట్రాక్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. టాక్ కూడా బాగుంది. తమిళ్ స్టార్ విజయ్ ‘మాస్టర్’ 13న విడుదలకు రెడీ అవుతోంది. 14న రామ్ సినిమా ‘రెడ్’ రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ సినిమా రిలీజ్ 15న ప్లాన్ చేశారు.
అయితే.. బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ సినిమాను ఒక రోజు ముందుకు జరుపాలని నిర్ణయించడంతో పంచాయితీ మొదలైంది. ఈ సినిమాను 14వ తేదీనే విడుదలకు రెడీ చేస్తున్నారు. ఈ విషయాన్ని అడియో ఫంక్షన్ లో అధికారికంగా అనౌన్స్ చేయాలని చూస్తున్నారట.
అయితే.. ఉన్నట్టుండి డేట్ మార్చడంపై మిగిలిన సినిమాల జనాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ రెడ్ కూడా 14వ తేదీనే రిలీజ్ అవుతుండడంతో.. రెండు సినిమాలూ ఒకే రోజు విడుదలైతే కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
అల్లుడు అదుర్స్ సినిమా సడెన్ గా సంక్రాంతి బరిలోకి రావడమే గాకుండా.. ఇప్పుడు సడెన్ గా డేట్ మారుస్తున్నారనే అభ్యంతరాలు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ముందుకు వచ్చినట్లు సమాచారం. అక్కడ డిస్ట్రిబ్యూటర్లతో పంచాయతీ నడుస్తోందని తెలుస్తోంది. మరి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అల్లుడు సంక్రాంతి పండక్కి ఏ రోజున వస్తాడు? అన్నది చూడాలి.