అమల అలా! బార్బీ డాల్‌ లా!

Update: 2016-12-26 04:33 GMT
విడాకులు తీసుకోబోతోన్న విషయాన్ని చెప్పేశాక.. అమలా పాల్ తెగ బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు సైన్ చేసేస్తూ ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు సినిమాల్లో నటించడం దగ్గరే భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తాయనే వెర్షన్ ముందే వినిపించింది. అయితే విడిపోవడం ఖాయం అయ్యాక కొన్నాళ్ల పాటు వెకేషన్ టూర్ వేసొచ్చిన ఈ భామ.. ఇప్పుడు ఏకంగా ఏడు సినిమాలను లైన్లో పెట్టేసింది. అన్నీ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యేవే కావడం విశేషం.

క్రిస్మస్ పండుగ సందర్భంగా అమలాపాల్ తో చెన్నై టైమ్స్ మేగజైన్ ఓ ఫోటో షూట్ చేసింది. క్రిస్మస్ హౌస్.. పక్కనే ప్యాక్ చేసిన బోలెడన్ని గిఫ్ట్ లు.. వెనకాల కలర్ ఫుల్ లైటింగ్.. వీటన్నిటితో పాటు బార్బీ డాల్ ని తలపించే డ్రస్-మేకప్ లతో అమలాపాల్ ఇచ్చిన పోజు.. మొత్తం మీద స్టిల్ అదిరిపోయిందంతే. ట్రెండీగా మ్యాచింగ్ హైహీల్స్ వేయడంతో.. తన కాళ్ల అందాలను చూసేవాళ్లకు కనుల విందులా కనిపించేలా అమల స్టైలింగ్ బాగా ఆకట్టుకుంటోంది.

'ఈ క్రిస్మస్ అందరికి సంతోషం ఇవ్వాలని కోరుకుంటన్నా. ఈ ఫోటో షూట్ చేసినందుకు క్రిస్మస్ మెమరీస్..లైఫ్.. మీతో పంచుకునేందుకు అవకాశం కల్పించినందుకు చాలా చాలా థాంక్యూ' అని చెబుతోంది అమలా పాల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News